Top
logo

ఎనిమిదో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు

ఎనిమిదో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
X
Highlights

గ్రామాల్లో రూ. 55 వేల కోట్లు, పట్టణాల్లో రూ. 77 వేల కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పంచాయతీల్లో రూ. 35 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు రూ. 26 వేల కోట్లు నరేగా నిధులను వినియోగించామన్నారు.

గ్రామాల్లో రూ. 55 వేల కోట్లు, పట్టణాల్లో రూ. 77 వేల కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పంచాయతీల్లో రూ. 35 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు రూ. 26 వేల కోట్లు నరేగా నిధులను వినియోగించామన్నారు. రూ.5, 694 కోట్లతో 23, 553 కి.మీ సీసీ రోడ్ల నిర్మించామన్నారు. 8 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. రెండేళ్లలో గ్రామాల్లోని అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా మారుస్తామని తెలిపారు. 325 ఫ్లోరైడ్ గ్రామాలకు సురక్షిత తాగు నీరందిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. గ్రామీణ, పట్టణ మౌలిక వసతులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎనిమిదో శ్వేతపత్రం విడుదల చేశారు.

Next Story