ఉయ్యూరు జన్మభూమి సభలో రసాభాస

ఉయ్యూరు జన్మభూమి సభలో రసాభాస
x
Highlights

కృష్ణా జిల్లాలో నిర్వహిస్తున్న జన్మభూమి సభలు వివాదానికి దారి తీస్తున్నాయి. అభివృద్ధి పనుల ఎక్కడంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉండటం పాలకపక్షం ఎదురు దాడికి దిగడంతో తీవ్ర ఉద్రికత్తలు చోటు చేసుకుంటున్నాయి.

కృష్ణా జిల్లాలో నిర్వహిస్తున్న జన్మభూమి సభలు వివాదానికి దారి తీస్తున్నాయి. అభివృద్ధి పనుల ఎక్కడంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉండటం పాలకపక్షం ఎదురు దాడికి దిగడంతో తీవ్ర ఉద్రికత్తలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో భారీ బందోబస్తు మధ్య మంత్రులు, ఎమ్మెల్యేలు జన్మభూమి సభలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా జన్మభూమి సభలు రసాభాసగా మారుతున్నాయి. ఉయ్యూరులో నిన్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ వైసీపీ నేత పార్ధసారధిల మధ్య చోటు చేసుకున్న వివాదం ఈ రోజు మరింత ముదిరింది. ఓగిరేల జన్మభూమి సభలో పాల్గొన్న వైసీపీ నేత పార్ధసారధి పట్టణంలో అభివృద్ధి ఎక్కడ చేపట్టారో చెప్పాలంటూ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌లను నిలదీశారు. దీనిపై అభ్యంతరం చెప్పిన టీడీపీ నేతలు ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా గొడవ చేయడం సరికాదంటూ అడ్డుపడ్డారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని వైసీపీ నేతలను బలవంతంగా బయటకు పంపడంతో పరిస్ధితి సద్దుమణిగింది.

మంత్రి దేవినేని ఉమా ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరంలోనూ జన్మభూమి సభ రసాభాసగా మారింది. హౌస్ అరెస్ట్ చేసిన తమ పార్టీ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, వైసీపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇదే సమయంలో వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్ సభలో పాల్గొనేందుకు బయటకు రావడంతో పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు దీంతో పట్టణంలో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

వైసీపీ ఆందోళనను కవర్ చేస్తున్న మీడియాపై నూజివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంకుమార్ చేయి చేసుకోవడంతో మరోసారి ఉద్రిక్తత చెలరేగింది. సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రోడ్డుపై భైఠాయించి జర్నలిస్టులు నిరసన తెలిపారు. కృష్ణా జిల్లాలో నిర్వహిస్తున్న జన్మభూమి సభల్లో వరుస ఆందోళనలు చోటు చేసుకోవడంపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సభలను అడ్డుకోవడం ప్రతిపక్ష బాధ్యత రాహిత్యానికి నిదర్శనమంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే అరెస్ట్‌లు చేస్తారా ? అంటూ ప్రశ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories