ఓటుకు చికెన్‌'ముక్క.. మార్చుతోంది లెక్క..!

ఓటుకు చికెన్‌ముక్క.. మార్చుతోంది లెక్క..!
x
Highlights

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా నిర్వహిస్తున్న ప‌ంచాయ‌తీ ఎన్నికలకు హ‌డావిడి మొద‌లైంది. గ్రామాల్లో రాజ‌కీయం వేడెక్కింది. సర్పంచ్ గ్రామానికి రాజు లాంటివాడు. అయితే ఈ పంచాయతీ పోరులో ఓటర్లకు గాలం వేసేందుకు నాయకులు, అభ్యర్థులు తమ అస్త్రాలు బయటకు తీస్తుంటారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా నిర్వహిస్తున్న ప‌ంచాయ‌తీ ఎన్నికలకు హ‌డావిడి మొద‌లైంది. గ్రామాల్లో రాజ‌కీయం వేడెక్కింది. సర్పంచ్ గ్రామానికి రాజు లాంటివాడు. అయితే ఈ పంచాయతీ పోరులో ఓటర్లకు గాలం వేసేందుకు నాయకులు, అభ్యర్థులు తమ అస్త్రాలు బయటకు తీస్తుంటారు. సాధరణంగా అయితే డబ్బు, మద్యంతో ఓటర్లను లొంగదీసుకుంటారు. అయితే ఓ గ్రామంలో మాత్రం వింత రాజకీయం నడుస్తోంది. నామినేషన్ వేసిన దగ్గరి నుండి ఎన్నిక ముగిసేవరకు పోటీలో ఉన్న అభ్యర్థులు గ్రామంలో ఉన్న ప్రతిఒక్క కుటుంబానికి చికెన్ పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ గ్రామంలో ఇదేం ఏం కొత్త కాదు గత రెండు మూడు సార్లు అయిన సర్పంచ్, ఎంపిటీసీ ఎన్నికల్లో కూడా ఇదే తరహా పంపిణీ చేశారు. అయితే ఎన్నికల్లో ఒక్క చికెన్ ముక్కనే ఓటర్లను తమ వైపు మలుపుకుందంటే నమ్మబుద్ది కాదు. ఆ గ్రామమే జగిత్యాల మండలంలోని లక్ష్మీపూర్.

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లో గత 2006లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓసారి గర్వంద గంగయ్య, గర్వంద గంగాధర్ ఎన్నికల బరిలో నిలిచారు. కాగా ఎన్నికల్లో ఒకరికి తెలియకుండా మరోకరు ఓటర్లకు గాలం వేసేందుకు చికెన్ పంపిణీ చేశారు. మొత్తానికి ఎన్నికలు ముగిసి ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి. కాగా ఈ ఎన్నికల్లో గర్వంద గంగయ్య కేవలం 8ఓట్లతోనే గెలిచి పదవి పగ్గాలు అందుకున్నాడు. అంటే చూడుర్రి చికెన్ ముక్కలు ఓటర్లను ఏ విధంగా ప్రభావం చేసిందో అర్థం చేసుకొవోచ్చు. 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే సీన్ రిపిట్ అయ్యింది.

కాగా ఈ 2019 ఎన్నికల్లో లక్ష్మీపూర్‌ ప్రస్తుతం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ అయ్యింది. అయితే ముచ్చటగా మూడోసంవత్సరం కూడా ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు పోటాపోటీగా చికెన్ పంచుడు మొదలు పెట్టిర్రు. అయితే ఇప్పటి వరకు మంచిగానే ఉందికానీ ఇప్పడు మొదలైంది అసలు కథ. చలికాలం అయ్యేసరికి చికెన్ రుచిగా ఉండటం లేదని మేమే ఓ మేకను లేదా గొర్రెను కొనుకుంటాం దానికి తగ్గా పైసలు ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు ఓటర్లు. ఇక దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. మరికొంత మంది చికెన్‌ ఇచ్చిన పర్వలేదు కాని చికెన్‌తో పాటు ఓ కోటరు బాటీలు ఇవ్వలని కోరుకుంటున్నారు అక్కడి జనాలు. జనాలు కూడా చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు ఎప్పుడు చికెన్ ఎంది.. మటన్ కావాలని కొందరు. మరి కొందరు ముక్కతో పాటు సుక్క ఉంటేనే బాగుంటుందని మరి కొందరు డిమాండ్ చేస్తున్నారు. జనాలు అభ్యర్థులను వాడుకోవడం ఇదే సరైనా సమయం అని గురి చూసి కొడుతున్నారు ఆ గ్రామస్థులు. మొత్తానికి ఓటుకు చికెన్‌ ముక్క.. మార్చుతోంది లెక్క.

Show Full Article
Print Article
Next Story
More Stories