Top
logo

గుండెపోటు వస్తే తలకు గాయాలవుతాయా?: చంద్రబాబు

గుండెపోటు వస్తే తలకు గాయాలవుతాయా?: చంద్రబాబు
X
Highlights

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను చంద్రబాబు విమర్శించారు. వైఎస్‌ సోదరుడు వివేకానంద రెడ్డి హత్యను రాజకీయం చేయడాన్ని...

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను చంద్రబాబు విమర్శించారు. వైఎస్‌ సోదరుడు వివేకానంద రెడ్డి హత్యను రాజకీయం చేయడాన్ని తప్పుబట్టారు. గుండెపోటు వస్తే తలకు గాయాలవుతాయా అని ప్రశ్నించారు.?ఉదయం లేని లేఖను సాయంత్రానికి పుట్టించారన్నారు. గవర్నర్‌ వద్దకు వెళ్లి తప్పుడు ఫిర్యాదులిచ్చారని, శవపరీక్షకు తీసుకెళ్లకుండా చాలా సేపు నాటకాలు ఆడారని విమర్శించారు. ఇలాంటి దుర్మార్గులను ఎప్పుడూ చూడలేదని, వీరు ప్రతిపక్షంలోనూ ఉండకూడదన్నారు చంద్రబాబు. పోలీసులు వచ్చేసరికి ఆధారాలు మాయం చేశారని, వివేకా హత్య కేసులో ఇన్ని విషయాలు ఎందుకు దాచారని ప్రశ్నించారు? వివేకా హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారో జగన్‌ ప్రజలకు చెప్పాలన్నారు. తప్పు చేసిన వాళ్లు జైలుకు వెళ్లే వరకు వదలకూడదని చెప్పారు చంద్రబాబు.

Next Story