ఆవు దూడ వింత ప్రవర్తన! మనిషిలాగా..

ఆవు దూడ వింత ప్రవర్తన! మనిషిలాగా..
x
Highlights

సృష్టిలో విచిత్రాలకు కొదవలేదు. ప్రపంచంలో రోజూ ఏదో ఓ చోట ఇవి జరుగుతూనే ఉంటాయి. అయితే, వెలుగులోకి వచ్చేవి మాత్రం కొన్నే. ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం...

సృష్టిలో విచిత్రాలకు కొదవలేదు. ప్రపంచంలో రోజూ ఏదో ఓ చోట ఇవి జరుగుతూనే ఉంటాయి. అయితే, వెలుగులోకి వచ్చేవి మాత్రం కొన్నే. ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం అంతకంటే విచిత్రం. ఒక దూడ వింతగా ప్రవర్తిస్తోంది. ఓ దూడ మనిషిలాగా ప్రవర్తిస్తున్న సంఘటన తమిళనాడులోని వేలూరు జిల్లా అంబూరు ప్రాంతం వీరంకుప్పం గ్రామంలో జరిగింది. మనిషి లాగా ఇంట్లోనే తిరుగుతూ ఇంట్లోనే మనుషులతో కలిసి నిద్రపోతోంది. ఆనంద్ అనే రైతుకు ఆవుల మంద ఉంది. ఒక ఆవు మగ దూడను ప్రసవించింది. అయితే రాత్రి వేళలో దూడ ఇంట్లోకి ప్రవేశించి చాప, మెత్తపై పడుకొని అక్కడే రాత్రంతా పడుకుంటోందని యజమాని తెలిపారు. చిన్న పిల్లల కోసం తీసుకొచ్చే తినుబండారాలు తింటూ, ఇంటిలో ఉన్న బిందలో నీళ్లు తాగి అక్కడే విశ్రాంతి తీసుకుంటుంది. అయితే ఆకలితో ఉన్నప్పుడు మాత్రం ఆ దూడ ఆవు దగ్గరకు వెళ్లి పాలు తాగి వస్తోందని యాజమాని చెప్పాడు.ఆవు దూడ వింత ప్రవర్తన!

Show Full Article
Print Article
Next Story
More Stories