వైరల్‌: ఆ గేదె తెలివికి ఆశ్చర్యపోతారు

వైరల్‌: ఆ గేదె తెలివికి ఆశ్చర్యపోతారు
x
Highlights

ఈ భూమిపై మనిషి అతి తెలివైన జీవిగా తన ఉనికి చాటుకుంటున్నాడు. మనిషి తలుచుకుంటే ఈ లోకంలో ఎమైనా చేయగలడని నేటికి నిరూపిస్తున్నాడు. కొన్ని కొన్ని...

ఈ భూమిపై మనిషి అతి తెలివైన జీవిగా తన ఉనికి చాటుకుంటున్నాడు. మనిషి తలుచుకుంటే ఈ లోకంలో ఎమైనా చేయగలడని నేటికి నిరూపిస్తున్నాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనిషంత కాకపోయినా! ఓ చిన్నపాటి తెలివిని ప్రదర్శించి, మనుషుల్నే అవాక్ అయ్యేలా చేస్తున్నాయి కొన్ని మూగజీవులు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతోంది. ఓ గేదె తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అసలే ఎండాకాలం, భానుడు భగభగమంటున్నాడు సరిగ్గా ఈ క్రమంలో పట్టపగలు ఓ గేదెకు దాహం వేసింది. సుట్టుపక్కల మొత్తం చూసింది. ఎక్కడ సుక్క నీళ్లు జాడ దోరకలేదు. అయితే ఈ క్రమంలోనే ఆ గేదెకు బోరింగ్ పంప్ అవుపించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ గేదె బోరింగ్ పంపు దగ్గరికి వెళ్లింది. కొద్ది సేపు చూసింది. ఇంకేముంది బాగా అలవాటున్న దానిలా బోరింగ్ హ్యాండ్‌ను దాని కొమ్ములతో పైకి కిందికి అన్నది వచ్చిన నీళ్లను కడుపునిండా తాగేసింది. మొత్తానికి గేదె ప్రయత్నానికి నెటిజన్లు తెగ ముచ్చట పడిపోతున్నారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories