Top
logo

కోమటిరెడ్డి బ్రదర్స్‌కి ఎంపీ బూర నర్సయ్య సవాల్

కోమటిరెడ్డి బ్రదర్స్‌కి ఎంపీ బూర నర్సయ్య సవాల్
X
Highlights

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా మారుతుంది. ఒకరిపై మరోకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు నాయకులు. తాజాగా...

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా మారుతుంది. ఒకరిపై మరోకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు నాయకులు. తాజాగా భువనగిరి పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ రాజగోపాల్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. గతంలో ఐదేళ్లు ఎంపీగా ఉండి భువనగిరికి రాజగోపాల్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. తన కాంట్రాక్టులను మాత్రమే సెట్ చేసుకున్నాడని ఆరోపించారు. ఇరవై ఏళ్లు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏం చేశారో నల్గొండ చౌరస్తాలో చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులో వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. డబ్బు రాజకీయాలతో నల్గొండ రాజకీయాలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఎన్ని కుయుక్తులు పన్నినా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఓటమి తప్పదని, భువనగిరి ఖిల్లాపై మరోసారి గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Next Story