logo

మమతపై మీమ్ రాస్తే జైలుకేనా?

మమతపై మీమ్ రాస్తే జైలుకేనా?
Highlights

ఎన్నికల ప్రచారంలోనూ, రాజకీయాల్లోనూ విమర్శలు, సెటైర్లు సహజం కానీ రాజకీయ నాయకులు వాటిని సీరియస్ గా తీసుకుంటే...

ఎన్నికల ప్రచారంలోనూ, రాజకీయాల్లోనూ విమర్శలు, సెటైర్లు సహజం కానీ రాజకీయ నాయకులు వాటిని సీరియస్ గా తీసుకుంటే వాటిని షేర్ చేసిన వారికి సీన్ సితార్ అయిపోతుంది. బెంగాల్ లో అదే జరిగింది. మమతా దీదీ మీమ్ ను షేర్ చేసినందుకు ఓ బీజేపీ కార్యకర్త అరెస్టయి జైలు పాలయ్యారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

బెంగాల్ పోల్ సీన్ వేడెక్కుతోంది. మమతా బెనర్జీకి, మోడీ టీమ్ కి అక్కడ పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతోంది. బీజేపీ కార్యకర్త ఒకరు మమతా దీదీపై ఒక మీమ్ ను షేర్ చేయడం తాజాగా రచ్చకు దారి తీసింది. బీజేపీ యువమోర్చా నేత ప్రియాంక శర్మ మమతా బెనర్జీపై వచ్చిన ఒక మార్ఫింగ్ ఫోటోను షేర్ చేసినందుకు దీదీ సర్కార్ ఆమెపై కన్నెర్ర చేసింది. పోలీసులు ఆమెను అరెస్టు చేయడంతో బీజేపీ, వర్సెస్ తృణమూల్ మధ్య వార్ తారస్థాయికి చేరింది. న్యూయార్క్ లోని ఒక మెగా ఈవెంట్ లో పాల్గొన్న బాలీవుడ్ నటి ప్రియాంక ముఖాన్ని మమతా బెనర్జీ ముఖంతో మార్ఫింగ్ చేసిన ఒక ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రియాంక శర్మ ఆ ఇమేజ్ ను షేర్ చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

బీజేపీపై గుర్రుగా ఉన్న దీదీ ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ప్రచారానికి అనుమతి నివ్వలేదు. అలాగే యోగీ ఆదిత్య నాథ్ పాల్గొనాల్సిన ర్యాలీకి అనుమతినివ్వలేదు. మమతా దీదీ అభద్రతా భావంతో ఉన్నారని అందుకే తమకు అనుమతులివ్వడం లేదని బీజేపీ మండిపడింది.


లైవ్ టీవి


Share it
Top