మంగళగిరిలో బెట్టింగ్ రాయుళ్లజోరు.. లోకేష్ ఒటమి పైనే...

మంగళగిరిలో బెట్టింగ్ రాయుళ్లజోరు.. లోకేష్ ఒటమి పైనే...
x
Highlights

ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. ఇక మిగిలింది ఒక్క ఎన్నికల ఫలితాలు మాత్రమే. ఇప్పడు అందరి చూపు ఏపీ ఎన్నికల ఫలితాలపైనే పడింది. ఏపీలో ఎన్నికల్లో...

ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. ఇక మిగిలింది ఒక్క ఎన్నికల ఫలితాలు మాత్రమే. ఇప్పడు అందరి చూపు ఏపీ ఎన్నికల ఫలితాలపైనే పడింది. ఏపీలో ఎన్నికల్లో విజేతగా ఎవరు నిలుస్తారనేది ఇప్పడు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కాగా ఏపీలో ఇప్పడు మొత్తం బెట్టింగ్ జోరు నడుస్తోంది. అయితే మంగళగిరి నియోజకవర్గంపై బెట్టింగ్ రాయుళ్ల కన్ను పడింది. ఎందుకనుకుంటున్నారా? అక్కడి ఎన్నికల బరిలో దిగింది సాదా సీదా వ్యక్తి కాదుగా. ఏకంగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుగారి ఒకక్కగానోక్క కొడుకు నారా లోకేష్ పోటీలో ఉండటమే ఇక్కడి నియోజకవర్గం హట్ టాపిగ్‌గా మారింది. తొలిసారిగా ఎన్నికల్లో పోటీకి దిగిన నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అయితే లోకేశ్ బాబుకి పోటీగా ఎన్నికల బరిలో ప్రతిపక్ష పార్టీ (వైసీపీ) గట్టి అభ్యర్ధినే దింపింది. వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇక్కడ బరిలోకి దిగారు. ఇక దీంతో మంగళగిరి గెలుపోటములు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

మరోవైపు బెట్టింగ్ రాయుళ్లు మంగళగిరిపై కాయ్ రాజా కాయ్ అంటున్నారు. అయితే ఇక్కడ వాళ్లు చాలా మంది నారా లోకేశ్ పైనే బెట్టింగ్ కాస్తున్నారు. లోకేశ్ పై లక్షల కిద్ది బెట్టింగ్ కాస్తున్నారు. చాలామంది లోకేష్ ఓడిపోతాడని బెట్టింగ్ కాస్తున్నారే కానీ లోకేష్‌ గెలుపుపై మాత్రం బెట్టింగ్ కట్టేవాళ్లే లేరు. అయితే ఒకవేళ లోకేష్‌పై గెలుస్తాడని బెట్టింగ్ పెడితే వారి పంట పండనుంది. నారా లోకేష్ గెలుస్తాడంటూ ఒక రూపాయి బెట్ కాస్తే నిజంగానే అది జరిగితే దానికి డబుల్ అంటే రెండు రూపాయలు దక్కే పరిస్థితి ఉందట. మరోవైపు ప్రతిపక్ష పార్టీ వైసీపీ అభ్యర్థి అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరిలో గెలుపు మాత్రం ఖాయమంటూ అందరూ చెబుతున్నారు. ఇక దీంతో మంగళగిరి గెలుపోటములు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి నారాలోకేశ్, ఆళ్ల రామకృష్ణారెడ్డిల పై బెట్టింగ్ పెట్టిన బెట్టింగ్ రాయుళ్లుకు ఏ అభ్యర్ధి కాసుల వర్షమే కురిపిస్తోందో లేదో చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories