Top
logo

బాలకృష్ణ ఫ్యాన్స్‌తో అలాగే ఉంటారు... అసలు విషయం చెప్పేసిన వసుంధర

బాలకృష్ణ ఫ్యాన్స్‌తో అలాగే ఉంటారు... అసలు విషయం చెప్పేసిన వసుంధర
X
Highlights

ఎన్నికల ప్రచారానికి మరో రెండ్రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతుంది....

ఎన్నికల ప్రచారానికి మరో రెండ్రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతుంది. నువ్వానేనా అన్నంతగా పార్టీ అభ్యర్థులు ముమ్మురంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందుపురంలోని పలు ప్రాంతాల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తునే పార్టీ కార్యకర్తలు, అభిమానులపై చిందులు తొక్కుతుంటాడు బాలయ్య. ఇటివలే జర్నలిస్టుపై దాడి, తాజాగా ఎన్నికల ప్రచారంలో టీడీపీ కార్యకర్తను బాలకృష్ణ వెంటపడి మరీ కొడుతున్న వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే అయితే తాజాగా బాలయ్య వ్యవహారంపై భార్య వసుంధరా దేవి స్పందించారు.

బాలయ్య తన అభిమానులతో చాలా సరదగా, ప్రేమ, ఫ్రెండ్లీగా ఉంటారని అన్నారు. అయితే కొన్నిసార్లు మాత్రం తన ఫ్యాన్స్ ఎదైనా తప్పుచేసిన కానీ తప్పుగా ప్రవర్తించినా బాలయ్యకు చాలా కోపం వస్తుందన్నారు వసుంధరా. అయితే కేవలం తన ఫ్యాన్స్ ఉన్న అభిమానం, మనవాళ్లు అన్న అభిమానంతోనే బాలయ్యబాబు అలా ఉంటారన్నారని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ ఏమన్న కానీ తన ఫ్యాన్స్‌ కూడా ఏమీ అనుకోరన్నారు వసుంధర అన్నారు. అయితే బాలయ్య బాబు గిట్టని వారు దీన్ని వేరేరకంగా హైలైట్ చేసి ప్రచారం చేస్తున్నారని వసుంధరా దేవి ఆరోపించారు. కాగా పేద ప్రజలు కష్టాల్లో ఉంటే బాలకృష్ణ తట్టుకోలేరన్నారు. బసవతారకం ఆసుపత్రికి ఎవరు వచ్చినా కానీ చికిత్సను మాత్రం ఎప్పుడు నిరాకరించలేదని అన్నారు. కాగా డబ్బులున్నా, లేకపోయినా, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు వచ్చినా, రాకున్న కాని అందరికి చికిత్స అందేలా బాలకృష్ణ చొరవ తీసుకుంటారని వసుంధర తెలిపారు.

Next Story