Top
logo

కేసీఆర్ పెట్టేది ఫెడరల్ ఫ్రంట్ కాదు..మోడీ ఫ్రంట్

కేసీఆర్ పెట్టేది ఫెడరల్ ఫ్రంట్ కాదు..మోడీ ఫ్రంట్
X
Highlights

వైసీపీ అధినేత జగన్ కేటీఆర్‌తో చర్చలు జరపడం ద్వారా ఆంధ్రా ప్రజల ఆత్మగౌరవాన్ని హైదరాబాద్‌లో తాకట్టు పెట్టారని ఏపీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు.

వైసీపీ అధినేత జగన్ కేటీఆర్‌తో చర్చలు జరపడం ద్వారా ఆంధ్రా ప్రజల ఆత్మగౌరవాన్ని హైదరాబాద్‌లో తాకట్టు పెట్టారని ఏపీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. కాంట్రాక్టుల కోసం, వచ్చే ఎన్నికల్లో ధనసాయం కోసం కక్కుర్తిపడి టీఆర్ఎస్‌తో జగన్ లాలూచీ పడ్డారని ఆరోపించారు. కేటీఆర్ తో భేటీపై జగన్ సమాధానం చెప్పాలని దేవినేని నిలదీశారు. వైసీపీ అధినేత జగన్, కేటీఆర్‌తో జరిపిన చర్చలు ఫెడరల్ ఫ్రంట్ గురించి కాదనీ మోడీ ఫ్రంట్ గురించని ఏపీ మంత్రి దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. కేవలం చంద్రబాబు మీద కక్షతో ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, జగన్ ఏకమయ్యారని మండి పడ్డారు. గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ దేవినేని మండిపడ్డారు. ఆంధ్రపేపవర్ వల్లకు మంత్రాలు కూడా రావని ఆనాడు కేసీఆర్ అన్నారని దేవినేని వ్యాఖ్యానించారు. అపలె కేసీఆర్ పెట్టేది ఫేడరల్ ఫ్రంట్ కాదని అది ప్రధాని మోడీ ఫ్రంట్ అని ఎద్దేవా చేశారు.గతంలో కేసీఆర్ సీమాంధ్రులను ఎలా తిట్టారో జగన్‌కు గుర్తులేదా అని దేవినేని ఉమ ప్రశ్నించారు. సీమాంధ్ర సంస్కృతిని కేసీఆర్ ఎలా అవమానించారో మరచిపోయి జగన్ వారితోనే చర్చలు జరపడం దారుణమని అన్నారు. కేసీఆర్ గతంలో ఆంధ్రులను తిట్టిన మాటలు ఇంకా చెవుల్లో మార్మోగుతున్నాయని దేవినేని చెప్పారు


Next Story