Top
logo

నర్సరావుపేట పార్లమెంట్ సీటు ఎవరికి?

నర్సరావుపేట పార్లమెంట్ సీటు ఎవరికి?
Highlights

నర్సరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గంపై చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎంపీ అభ్యర్ధితోపాటు ఎమ్మెల్యే...

నర్సరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గంపై చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎంపీ అభ్యర్ధితోపాటు ఎమ్మెల్యే అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. నర్సరావుపేట నుంచి కోడెలను బరిలోకి దింపాలని బాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నర్సరావుపేట లేదా సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే కోడెల మొగ్గుచూపుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇక నర్సరావుపేట ఎంపీ సీటును కోరుతున్న రాయపాటి తన కుమారుడు రంగబాబుకి సత్తెనపల్లి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నర్సరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తోన్న చంద్రబాబు చిలకలూరిపేటకి ప్రత్తిపాటి పుల్లారావు, వినుకొండ నుంచి జీవీ ఆంజనేయులు, పెదకూరపాడుకి కొమ్మాలపాటి శ్రీధర్‌, గురజాల నుంచి యరపతినేని శ్రీనివాస్‌ను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే సత్తెనపల్లి నుంచి కోడెల లేదా రాయపాటి రంగబాబు పరిశీలిస్తుండగా, మాచర్లలో బీసీ అభ్యర్ధి లేదా బోనబోయిన శ్రీనివాస్‌‌ను, అలాగే నర్సరావుపేట కోసం కొత్త అభ్యర్ధి కోసం సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story


లైవ్ టీవి