ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా ..!

ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా ..!
x
Highlights

ఈ నెల14న నిర్వహించాలనుకున్న ఎపి మంత్రివర్గ సమావేశం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంకా స్పష్టత రాకపోవడంతో వాయిదా...

ఈ నెల14న నిర్వహించాలనుకున్న ఎపి మంత్రివర్గ సమావేశం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంకా స్పష్టత రాకపోవడంతో వాయిదా తప్పనిసరి కానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సెలవులో ఉండడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. ఈసీ అనుమతిపై ఇప్పటికి సస్పెన్స్ కొనసాగుతోంది.

ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పటికే ఓ సారి వాయిదా పడిన ఏపీ కేబినెట్ సమావేశం ... తాజాగా మరో సారి వాయిదా పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14న కాకుండా ... 15న సమావేశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టత రాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్టు సమాచారం. ఏపీ ఎన్నికల అధికారి ద్వివేది సెలవులో ఉండటంతో .. ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేరు. ఇదే సమయంలో ఈసీ అనుమతిపై సస్పెన్ష్ కొననసాగుతోంది. కేబినెట్ సమావేశంపై ఆయా శాఖలను నోట్ పంపిన సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం .. సమావేశానికి హాజరయ్యే విషయంలో మరింత స్పష్టత ఇవ్వాలంటూ ఈసిని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories