ఏపీ కేబినెట్ సమావేశం మరోసారి వాయిదా..!

ఏపీ కేబినెట్ సమావేశం మరోసారి వాయిదా..!
x
Highlights

ఏపీ కేబినెట్‌ మీటింగ్‌పై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే ఒకసారి వాయిదాపడ్డ మంత్రివర్గ సమావేశం... ఇప్పుడు మరోసారి పోస్ట్‌పోన్ అయినట్లు...

ఏపీ కేబినెట్‌ మీటింగ్‌పై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే ఒకసారి వాయిదాపడ్డ మంత్రివర్గ సమావేశం... ఇప్పుడు మరోసారి పోస్ట్‌పోన్ అయినట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో... అసలు కేబినెట్‌ మీటింగ్‌ ఉంటుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొదట మే 10న సమావేశం కావాలనుకున్నా, ఎన్నికల కోడ్ కారణంగా కేబినెట్‌ మీటింగ్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో, దాన్ని మే 14కి వాయిదా వేసుకున్నారు. అదే సమయంలో మే 14న మంత్రివర్గ సమావేశానికి ఏర్పాట్లు చేయాలంటూ సీఎంవో నుంచి రెండోసారి నోట్ రావడంతో అందుకు అనుగుణంగా సీఎస్‌ చర్యలు చేపట్టారు. సీఎంవో నుంచి కేబినెట్ అజెండా తీసుకొని, ఆయా శాఖాధిపతులకు పంపి నివేదికలు తీసుకున్నారు. అలాగే ఆయా శాఖలు ఇచ్చిన సమాచారంపై స్క్రీనింగ్ కమిటీలో చర్చించి, కేబినెట్ అజెండాను సీఈసీకి పంపారు, అయితే మే 14న నిర్వహించాలనుకున్న మంత్రివర్గ సమావేశం మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. కేబినెట్‌ అజెండాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినా, అక్కడ్నుంచి ఎలాంటి స్పష్టత, అనుమతి రాకపోవడంతో, మంత్రివర్గ మీటింగ్‌ 15న జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఒకవైపు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది సెలవులో ఉండటం మరోవైపు కేబినెట్‌ మీటింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి రాకపోవడంతో మంత్రివర్గ సమావేశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరి ఏపీ కేబినెట్‌ మీటింగ్‌కు సీఈసీ అనుమతి ఇస్తుందా? లేదా?


Show Full Article
Print Article
Next Story
More Stories