logo

టీడీపీకి గుడ్‌బై చెప్పిన మరో కీలకనేత

టీడీపీకి గుడ్‌బై చెప్పిన మరో కీలకనేత

ఏపీలో ఎన్నికలకు కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో వలసల బాట పడుతూనే ఉన్నారు నేతలు. తాజాగా అధికార పార్టీ టీడీపీకీ భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత గుడ్ బై చెప్పారు. విజయనగరం జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు కొండపల్లి కొండలరావు రాజీనామా చేశారు. తనకు తెలుగుదేశం పార్టీలో చాలా అన్యాయం జరిగిందని కొండలరావు ఆవేదన వ్యక్తం చేశారు. రేపు (ఆదివారం) తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో కలిసి వైసీపీ పార్టీలో చేరుతున్నట్ల కొండలరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. గత 37 ఏండ్లుగా టీడీపీలో పనిచేశానని అయినా కానీ పార్టీ నన్ను గుర్తంచలేదని వాపోయారు.

లైవ్ టీవి

Share it
Top