Top
logo

ఘనంగా ఆకాశ్‌, శ్లోకా వివాహం

ఘనంగా ఆకాశ్‌, శ్లోకా వివాహం
Highlights

అపర కుభేరుడు దేశంలో అత్యంత ధనవంతుడు ముఖేశ్‌ అంబానీ ఇంట పెళ్లి బాజా మోగింది. ఆయన కుమారుడు ఆకాశ్‌, వజ్రాల...

అపర కుభేరుడు దేశంలో అత్యంత ధనవంతుడు ముఖేశ్‌ అంబానీ ఇంట పెళ్లి బాజా మోగింది. ఆయన కుమారుడు ఆకాశ్‌, వజ్రాల వ్యాపారి రసెల్‌ మెహతా కుమార్తె శ్లోకా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అతిరథ మహారథుల సమక్షంలో ముంబైలోని ప్రసిద్ధ ట్రిడెంట్‌ హోటల్‌లో ఆకాశ్‌, శ్లోకా వివాహం వేడుక అబ్బురపర్చింది. సౌత్‌ టూ నార్త్‌, బాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌ వరకు స్టార్లంతా క్యూ కట్టారు. ఫిల్మ్‌, స్పోర్ట్స్‌, పొలిటికల్‌ కేటగిరీలతో పాటు విదేశాలకు చెందిన ప్రముఖులు సైతం చేరుకున్నారు. స్పెషల్‌ లుక్‌లో సెలబ్రిటీలంతా హంగామా చేశారు.రిలయన్స్‌ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడి వివాహం అద్భుతంగా సాగింది. దేశవిదేశాలకు చెందిన వీవీఐపీల సమక్షంలో ముంబైలోని ట్రిడెంట్‌ హోటల్‌లో వివాహవేడుక వైభవంగా సాగింది. ఈ వేడుకకు బాలీవుడ్‌ తారాలోకం తరలివచ్చింది. వీరంతా వెడ్డింగ్ వెన్యూ బయట ఫోటోలకు ఫోజులిచ్చారు.

తర్వాత బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్‌లో వివాహ వేడుకల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. అతిథుల కోసం గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. పెళ్లి మంటపాన్ని అందమైన పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వివాహ వేడుక జరుగుతున్న హాల్‌ను అద్భుతంగా అలంకరించారు. అంబానీ స్క్వేర్ వద్ద అతిథుల కోసం ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటేన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇక పెళ్లి వేడుకలో భాగంగా నిర్వహించిన బరాత్ కార్యక్రమంలో అంబానీ కుటుంబసభ్యులతో పాటు, ఆత్మీయ అతిథులందరూ పాల్గొన్నారు. డ్యాన్సులతో అదరగొట్టారు. మ్యూజిక్‌కు తగ్గట్లుగా స్టెప్పులేసి హంగామా చేశారు. అమితాబ్‌, సచిన్‌, అమీర్‌, షారూఖ్‌ ఖాన్‌, రతన్‌టాటా వంటి ప్రముఖులతో పాటు బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ వంటి అతిథులు పెళ్లి వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Next Story

లైవ్ టీవి


Share it