టచ్‌లో 40 మంది ఎమ్మెల్యేలు.. మోదీ వ్యాఖ్యలపై చంద్రబాబు ఫైర్

టచ్‌లో 40 మంది ఎమ్మెల్యేలు.. మోదీ వ్యాఖ్యలపై చంద్రబాబు ఫైర్
x
Highlights

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 40 మంది తనతో టచ్ లో ఉన్నారని...

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 40 మంది తనతో టచ్ లో ఉన్నారని ఎన్నికలు ముగిసిన తర్వాత వారంతా ఆమెను విడిచిపెడతారని అన్నారు. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలను టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. ట్వీట్ల దాడి చేశారు. ఈ సిగ్గుమాలిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి ప్రధానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలటూ చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఉత్తరాదిలో ఓ ఎన్నికల సభలో ప్రధాని నరేంద్రమోడీ మమత బెనర్జీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడే మే 23న అన్ని చోట్ల కమలం వికసించబోతోందని మోడీ అన్నారు. తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీని విడిచి, పారిపోతారని ఇప్పటికే 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని మోడీ అన్నారు. మమతా బెనర్జీ రాజకీయంగా మనుగడ సాగించడం సాధ్యం కాదని ఎందుకంటే ఆమె ప్రజలను మోసం చేశారని మోడీ అన్నారు.

ఉత్తరాదిలో ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మోడీ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనం అని ట్వీట్ చేశారు. ప్రధాని తన వ్యాఖ్యలతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి ద్రోహం తలపెడుతున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రధాని తనహోదాను దిగజార్చుతున్నారని అసంబద్ధ వ్యాఖ్యలకు ఇది పరాకాష్ట అని చంద్రబాబు ట్వీచ్ చేశారు. అయినా, ఓ రాష్ట్ర శాసనసభ్యులు తనతో టచ్ లో ఉన్నారని చెప్పడం దేశ ప్రధాని స్థాయికి తగిన విషయం కాదని ఇది కచ్చితంగా అనైతిక వ్యవహారమేనని చంద్రబాబు తేల్చిచెప్పారు.

ఎన్నికల సంఘం నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలా? అంటూ ప్రశ్నించారు. ఈ సిగ్గుమాలిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి ప్రధానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలటూ చంద్రబాబు డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ మమత బెనర్జీపై వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories