logo

రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
Highlights

సూర్యాపేట జిల్లాలోని జనగామ క్రాస్‌రోడ్డు వద్ద నేటి ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ఓ...

సూర్యాపేట జిల్లాలోని జనగామ క్రాస్‌రోడ్డు వద్ద నేటి ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ఓ ప్రయివేటు బస్సు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కుడకుడ గ్రామానికి చెందిన సాయికుమార్‌, వినయ్‌‌గా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సాయి, వినయ్ మృతితో కుడకుడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


లైవ్ టీవి


Share it
Top