12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ రాజీనామా

12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ రాజీనామా
x
Highlights

కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మణిపూర్ రాష్ట్రంలో కాంగ్రెస్‌కి ఆ పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన...

కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మణిపూర్ రాష్ట్రంలో కాంగ్రెస్‌కి ఆ పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన 12మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేశారు. అయితే రాజీనామా చేసిన ఈ 12మంది ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని జోరుగా ఉహాగానాలు వచ్చాయి. ఉహాగానాలపై స్పందించిన ఓ సినీయర్ ఎమ్మెల్యే తాము ఏ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే ఇటివల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మణిపూర్‌లో ఉన్న రెండు ఎంపీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో ఇన్నర్‌ మణిపూర్ నుంచి బీజేపీ అభ్యర్థి రాజ్‌కుమార్‌ సింగ్‌, అవుటర్‌ మణిపూర్ నుంచి నాగా పీపుల్స్‌ ఫ్రంట్ అభ్యర్థి లొర్హో ఎస్ ఫోజ్ విజయం సాధించారు.

కేవలం ఈ కారణంగానే తాము పార్టీ వీడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం వారి రాజీనామా పత్రాలను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు, పీసీసీ అధ్యక్షుడు గయ్‌ఖంగంకు అందించారు. ప్రస్థుతం మణిపూర్‌లో బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే.బీజేపీ నాయకుడు బీరేన్ సింగ్ సీఎంగా ఉన్నారు. మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తంగా 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల అనంతరం 29 మంది కాంగ్రెస్‌ ఎమ్యెల్యేలు ఉండేవారు. తరువాత 8 మంది బీజేపీ గూటికి చేరారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 21 నుంచి 29 చేరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories