ఆ స్థానం టీడీపీకి అందని ద్రాక్షగా మారుతోందా..?

ఆ స్థానం టీడీపీకి అందని ద్రాక్షగా మారుతోందా..?
x
Highlights

విశాఖ రాజకీయ చరిత్రలో ఆ స్థానం టీడీపీకి అందని ద్రాక్షగా మారుతోందా..? దశాబ్ధాలుగా ఆ కుర్చీ ఎందుకు టీడీపీకి దక్కట్లేదు..? విశాఖ ఎంపీ సీటు అంటేనే...

విశాఖ రాజకీయ చరిత్రలో ఆ స్థానం టీడీపీకి అందని ద్రాక్షగా మారుతోందా..? దశాబ్ధాలుగా ఆ కుర్చీ ఎందుకు టీడీపీకి దక్కట్లేదు..? విశాఖ ఎంపీ సీటు అంటేనే టీడీపీకి పరాజయం అన్న సెంటిమెంట్ పొలిటీషియన్స్ లో పాతుకుపోవడానికి కారణం ఏంటి..? విశాఖ ఎంపీ సీట్ పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు ఎందుకు రావట్లేదు..? వైజాగ్ పార్లమెంట్ స్థానం అంటేనే చాలామంది టీడీపీ నేతలకు గుబులు పుడుతోంది. 1996 నుంచి 2014 వరకు విశాఖ ఎంపీ స్థానంలో టీడీపీ ఒక్కసారి మాత్రమే విజయం సాధించి. 1999లో ఎంవీవీఎస్ మూర్తి ఎంపీగా విజయం సాధించారు.

అప్పటి నుంచి ఇప్పటివరకూ జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీకి చేదు అనుభవమే మిగిలింది. కాంగ్రెస్ పార్టీ తరపున గతంలో టీ సుబ్బిరామిరెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, పురందేశ్వరి విశాఖ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఇక 2014 లో టీడీపీ, బీజేపి పొత్తులో భాగంగా కంభంపాటి హారిబాబు విజయం సాధించినా. అది బీజేపీ ఖాతాలో పడినట్లు అయింది. దీంతో సుదీర్ఘ కాలంగా టీడీపీ విశాఖ ఎంపీ స్థానం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. అంతేకాదు టిడిని నుంచి ఎవరు పోటీ చేసినా అపజయం తప్పదన్న సెంటిమెంట్ కూడా ఎక్కువైంది. దీంతో విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి టీడీపీ నేతలు మొగ్గు చూపడం లేదు. ప్రస్తుతం టీడీపీ పొత్తులు లేకుండా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉంది. ఇందులో భాగంగా మంత్రి గంటా శ్రీనివాసరావు. బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే గంటా అధిష్టానం‌కు కట్టుబడి వుంటానని చెబుతున్నా. సెంటిమెంట్ పరంగా ఎంపీ గా పోటీ చేసేందుకు వెనకడుగు వేస్తునట్లు సమాచారం. దీంతో అనేక సమీకరణాల మధ్య విశాఖ ఎంపీ సీటు ఎవరిని వరిస్తుందన్న చర్చ ఉత్కంఠ రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories