శివరాత్రి పర్వదినాన శివుణ్ణి పూజిస్తే కలిగే ఫలితాలేమిటి?

శివరాత్రి  పర్వదినాన శివుణ్ణి పూజిస్తే కలిగే ఫలితాలేమిటి?
x
Highlights

శివరాత్రి. శివుడు ఆనందపారవశ్యంతో తాండవం చేసే రాత్రి. కోరిన కోర్కెలు తీర్చేందుకు ఇలపై అఖండ జ్యోతిగా వెలసిన సుదినం. ప్రతీనెల ఓ శివరాత్రి వచ్చినా...

శివరాత్రి. శివుడు ఆనందపారవశ్యంతో తాండవం చేసే రాత్రి. కోరిన కోర్కెలు తీర్చేందుకు ఇలపై అఖండ జ్యోతిగా వెలసిన సుదినం. ప్రతీనెల ఓ శివరాత్రి వచ్చినా మాఘమాసంలో వచ్చే శివరాత్రికి మాత్రం ఎందుకంత వైశిష్ట్యం. ఈ పర్వదినాన శివుణ్ణి పూజిస్తే కలిగే ఫలితాలేమిటి?

ముల్లోకాలను దహించే హాలహలాన్ని తన గరళంలో బంధించి సమస్త లోకాలను కాపాడిన భోళా సంకరుడి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు శివరాత్రి. అందులోనూ సోమవారం వచ్చే శివరాత్రికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటి శివరాత్రి నాడు శివ నామస్మరణం ఎంత చేస్తే అంత శుభం చేకూరుతుందని భక్తుల నమ్మకం, విశ్వాసం. ఆ ఈశ్వరుడిని దూషించినా ఆ దూషణలో కూడా తన పేరును తలచుకున్నందుకు మోక్షాన్ని ప్రసాదించే భక్తవత్సలుడు ఈ పరమేశ్వరుడు. అందుకే ముల్లోకాలకూ లయకారకుడయ్యాడు. లోకాన్ని నడిపించే ఆదిశంకరుడిగా పూజలు అందుకుంటున్నాడు.

లోకమంతా శివనామస్మరణలతో మారుమోగే రాత్రి శివరాత్రి. లింగోద్భవ కాలంలో ఆ శివునికి అభిషేకం చేస్తే కైలాస ప్రాప్తి లభిస్తుందట. జన్మజన్మల పాపాలు నశించిపోతాయట. అందుకే ఎన్ని కష్టాల్లో ఉన్నా మరెన్ని సమస్యల్లో తనమునకలవుతున్నా శివరాత్రి పర్వదినాన ఆ శివుణ్ణి ధ్యానిస్తే సర్వం మటుమాయమవుతాయ్. ఇది శివ సత్యం.

శివ లీలామృతాన్ని ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. శివ పంచాక్షరీని ఎన్నిసార్లు జపించినా భక్తి పారవశ్యం తగ్గదు. శివరాత్రి నాడు గాలి కూడా శివోహం శివోహం అనే జపిస్తుందట. జఠాజూటిడికి అభిషేకాలు చేస్తే మట్టి రేణువులు కూడా శివుని రూపంగా మారేందుకు ఉవ్విళ్లూరుతుంటాయ్. శివరాత్రి పర్వదినాన భోళాశంకరుడు కొలువుదీరిన ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శించినా అఖండమైన ఫలితం లభిస్తుంది. ఒకవేళ ఏ కారణంతోనైనా శివలింగ దర్శనం చేయలేని వారు ఉపవాస దీక్షలను చేయలేని వారు కనీసం జాగరణ చేసినా శివరాత్రి ఫలం దక్కుతుందట. శివరాత్రి జాగరణ అంతటి ఫలప్రదం.

Show Full Article
Print Article
Next Story
More Stories