ఎన్నికల టైంలో సినిమాల విడుదల వెనక రాజకీయ వ్యూహమేంటి?

ఎన్నికల టైంలో సినిమాల విడుదల వెనక రాజకీయ వ్యూహమేంటి?
x
Highlights

షూటింగ్‌కు క్లాప్‌ కొట్టగానే హీటెక్కిస్తాయి. మోషన్‌ పిక్చర్‌తో ఎమోషన్‌ క్రియేట్ చేస్తాయి. టీజర్‌తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినా, కాంట్రావర్సీల కాకనూ...

షూటింగ్‌కు క్లాప్‌ కొట్టగానే హీటెక్కిస్తాయి. మోషన్‌ పిక్చర్‌తో ఎమోషన్‌ క్రియేట్ చేస్తాయి. టీజర్‌తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినా, కాంట్రావర్సీల కాకనూ రేపుతాయి. ట్రైలర్‌తో వేడి పుట్టించినా, అసలుసిసలు కథేంటో చెప్పకనే చెబుతాయి. ఇవి బాహుబలిలాంటి రాజుల కట్టుకథ కాదు....ప్రజల్లో రారాజులుగా వెలిగిన ఉద్దండుల వాస్తవ గాథలు. కోట్లాది గుండెల్లో కొలువైన నాయకుల బయోపిక్‌లు. ఎన్టీఆర్, వైఎస్సార్, మన్మోహన్, మోడీ, జయ, ఇలా ఎందరో మహామహా నాయకుల జీవితాలు, తెరమీదకొస్తున్నాయి. కథానాయకుడు ఆల్రెడీ వచ్చేశాడు. సినిమా ఎండింగ్‌ కార్డుతో, కాంట్రావర్సీ క్రియేట్ చేశాడు.

మనల్ని గెలిచే అవకాశం కాలానికి ఒక్కసారే ఇవ్వాలి. మనం పోయాకే అది గెలిచామని చెప్పుకోవాలి. ఇదీ కథానాయకుడులో ఎన్టీఆర్‌ డైలాగ్. ఆ మహా మనీషి...మనస్తత్వాన్ని, ఆయన ఆలోచనలని, దేనికీ వెరవని స్వభావాన్ని ఈ ఒక్క మాటలో చెప్పారు సినిమాలో. తన వ్యక్తిత్వానికి అనుగుణంగా నడుచుకుంటూ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎలా ఎదిగారనే దానికి అద్దంపట్టారు. మరి యంగ్‌ ఎన్టీఆర్‌లా, బాలయ్య ఒదిగిపోయాడా? వెండితెరను ఏలిన నట సార్వభౌముడి జీవితాన్ని తెరపై ఎలా ఆవిష్కరించారు....సినిమాలో కాంట్రావర్సీ రేపిన పొలిటికల్ సన్నివేశమేంటి? కథానాయకుడు. ఎన్నాళ్ల నుంచో అందరిలోనూ ఆసక్తి రేపుతున్న అన్నగారి బయోపిక్‌. ఇప్పుడు రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో అందరి నోటా అన్నగారి సినిమా గురించే చర్చ.

నందమూరి తారక రామారావు అనగానే ఒక ప్రభంజనం. వెండితెర ఇలవేల్పుగా కోట్లాది నీరాజనం. రాజకీయాల్లో ఒక సంచలనం. జానపదమైనా, పౌరాణికమైన, సాంఘికమైనా, ఇలా కథ ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా, తన నట విశ్వరూపంతో ఉర్రూతలూగించాడు ఎన్టీఆర్. కోట్లాదిమంది గుండెల్లో కొలువయ్యాడు. ఆ మహానటుడి జీవితానికి, తెరరూపం ఇవ్వాలన్న సంకల్పమే కథానాయకుడు. అన్నగారి జీవితాన్ని తెరకెక్కించాలనుకోవడం ఒక సాహసం. ఆయన తనయుడు బాలకృష్ణ, తండ్రి పాత్రను పోషించడం ఒక అద్భుతం. ఇప్పుడు ఈ అద్బుతం గురించే జనమంతా చర్చించుకుంటున్నారు. అన్నగారి వ్యక్తిగత జీవితమేంటి...సినిమాకు ముందు ఆయన లైఫేంటి...సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలేంటి...అన్నగారి పాత్రలో బాలయ్య ఎలా ఒదిగిపోయాడు...ఎన్టీఆర్‌ను తలపించాడా...మరిపించాడా...తెలుగు తెరపై విడుదలైన కథానాయకుడిపై ఇలా ఎన్నో చర్చలు.

ఎన్టీఆర్‌ జీవితాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించారు. మొదటిది కథానాయకుడు. రెండోది మహా నాయకుడు. ఫస్ట్ సినిమా ఆ‍యన సినిమా ప్రయాణం. అయినా కథానాయకుడి సినిమాలో ఎలాంటి మలుపులు, వివాదాలుంటాయన్న అంశాలు కూడా అందరిలోనూ ఆసక్తి కలిగించాయి. కానీ ఫస్ట్ పార్ట్‌లో వివాదాల జోలికే పోలేదు. రిజిస్ట్రార్‌గా ఆ‍యన జీవితం మొదలవడం, అవినీతిని సహించలేక రాజీనామా చేయడం, సినిమా అవకాశాల కోసం మద్రాసు ట్రైనెక్కడం, అక్కడ పస్తులుండి మరీ సినిమా అవకాశాల కోసం వెయిట్‌ చేయడం, ఆ తర్వాత వెండితెరపై విజృంభించడం వంటి కీలక ఘట్టాలున్నాయి కథానాయకుడిలో. అలాగే రాయలసీమ కరువుపై చలించి, తనతో పాటు కొందరు కళాకారులతో ఎన్టీఆర్‌ జోలెపడతాడు. దివిసీమ ఉప్పెన బాధితులను ఆదుకునేందుకు ఎన్టీఆర్-ఏఎన్నార్‌‌లు విరాళాలు వసూలు చేయడం, అందులో కొందరు బాధితుల మాటలు విని ఎన్టీఆర్‌ చలించిపోవడం వంటి ఘట్టాలు కూడా తెరకెక్కించారు. చివరికి నాదెండ్ల భాస్కర్‌ రావుతో కలిసి పార్టీని అనౌన్స్‌ చేసే సన్నివేశంతో కథానాయకుడు సినిమాకు శుభంకార్డు పడుతుంది. అసలుసిసలు రాజకీయ ఘట్టం మహానాయకుడులో ఉండబోతోంది.

ఎన్టీఆర్‌ పాత్రలో బాలయ్య ఒదిగిపోయారని చాలామంది అంటున్నారు. అలాగే క్రిష్‌ చక్కగా తెరరెక్కించారు. బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ అద్బుతంగా నటించారని ప్రేక్షకులంటున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా, చివర్లో ఎండయ్యే పొలిటికల్‌ సీన్స్‌పై వివాదం రాజుకుంటోంది. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories