ఎవరి నిర్వచనాలు వారివే.. ఇంతకీ లౌకిక రాజ్యమంటే ఏంటి?

ఎవరి నిర్వచనాలు వారివే.. ఇంతకీ లౌకిక రాజ్యమంటే ఏంటి?
x
Highlights

ప్రపంచంలో మరెక్కడా జరగని వింతలూ, విశేషాలూ సెక్యులర్ ఇండియాలోనే జరుగుతాయి. ఫిబ్రవరి 1వతేదీన సెక్యులర్ యూనివర్సీటీ గా ఉన్న కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్...

ప్రపంచంలో మరెక్కడా జరగని వింతలూ, విశేషాలూ సెక్యులర్ ఇండియాలోనే జరుగుతాయి. ఫిబ్రవరి 1వతేదీన సెక్యులర్ యూనివర్సీటీ గా ఉన్న కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ప్రభుత్వ యూనివర్సిటీ ఫిబ్రవరి 7వ తేదీన ఒక్కసారిగా నాన్ సెక్యులర్ యూనివర్సిటీగా మారిపోయింది. తమది సెక్యులర్ యూనివర్సీటీ అన్న వైస్ చాన్సలర్ ఒక్కసారిగా మాట మార్చారు. యూనివర్సిటీ క్యాంపస్ లో సరస్వతీ మాత పూజకు అనుమతించారు. సరస్వతీ దేవి కొలువై ఉండే విద్యాలయాల్లో ఆ దేవిని ఆరాధించడాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏళ్ళుగా వస్తున్న సంప్రదాయాలను ఎందుకు నిలిపివేస్తున్నారు? లౌకిక రాజ్యమైనంత మాత్రాన విద్యాలయాల్లో సంస్కృతీ సంప్రదాయాలను పాటించలేమా? లౌకిక రాజ్యం అంటే ఏమిటి? ప్రజల అభిమతాలను అడ్డుకోవడమే లౌకిక రాజ్యమా? లౌకిక రాజ్యానికి ఎవరికి వారు సొంత నిర్వచనాలు ఇస్తుంటే ......జరిగే పరిణామాలకు బాధ్యత వహించేదెవరు?

భారతదేశం లౌకిక రాజ్యం....నిజమే .....అంతమాత్రాన వేల ఏళ్ళుగా వస్తున్న సంస్కృతీ సంప్రదాయాలను నిషేధించాల్సిన అవసరం లేదు. అమెరికా కూడా లౌకిక రాజ్యమే....అయినా ఆ దేశ కరెన్సీ పై తాము దేవుడిని విశ్వసిస్తామన్న వ్యాఖ్య బోల్డ్ లెటర్స్ లో ఉంటుంది. ఆగ్నేయాసియాలో ఎన్నో ముస్లిం ప్రాబల్య దేశాల్లోనూ రామాయణ సంస్కృతిని గౌరవిస్తుంటారు. మరి మన సంస్కృతి పట్ల అలాంటి బోల్డ్ నెస్ మనకు ఎందుకు ఉండడం లేదు? మన దేశంలో హిందూమతానికి, భారతీయ సంస్కృతికి మధ్య ఉన్న విభజన రేఖ అతి పల్చటిది. అంత మాత్రాన వేల ఏళ్ళుగా వస్తున్న సంప్రదాయాలపై వేటు వేయడం సమంజసమా అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. భారతీయ సంస్కృతిలో చదువుల తల్లికి ఒక విశిష్ట స్థానం ఉంది. అందుకే విద్యాకేంద్రాల్లో సరస్వతీ పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. గత కొన్నేళ్ళుగా ఇలాంటి సంప్రదాయాలపై అనేక వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఎప్పటిలానే సరస్వతీ పూజ మరోసారి వివాదంగా మారింది.

నిజానికి విద్యాకేంద్రాల్లో సరస్వతీ దేవి పూజలు నిర్వహించడంపై నిషేధాలు, ఆంక్షలు కొత్తేమీ కాదు. గతంలో పశ్చిమ బెంగాల్ లో కూడా పలు విద్యాలయాల్లో ఈ పూజలను నిషేధించారు. ఆంక్షలు విధించారు. అవన్నీ చివరకు హింసాత్మకంగా మారాయి. సమాజంలో చోటు చేసుకుంటున్న విభజనను మరింత పెద్దదిగా చేసేందుకు మాత్రమే ఇలాంటి నిషేధాలు ఉపకరిస్తాయి. అదే సమయంలో ఈ పూజా కార్యక్రమాలు శాంతియుతంగా జరిగేలా, ఇతర గానా బజానాలకు వేదికలుగా మారకుండా చూసుకోవాలి. లౌకికతత్వానికి, మతోన్మాదానికి మధ్య ఉన్న విభజన రేఖను స్పష్టంగా గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories