అయిదో విడత బీజేపీకి అగ్ని పరీక్షేనా?

అయిదో విడత బీజేపీకి అగ్ని పరీక్షేనా?
x
Highlights

ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన అయిదవ దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్ దిగ్గజాలు రాహుల్, సోనియాల భవితవ్యమే కాదు బీజేపీ పట్టును కూడా తేల్చే...

ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన అయిదవ దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్ దిగ్గజాలు రాహుల్, సోనియాల భవితవ్యమే కాదు బీజేపీ పట్టును కూడా తేల్చే దశ కావడంతో పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. మహా ఘట్ బంధన్ దెబ్బ బీజేపీకి ఎంత గట్టిగా తగులుతుందన్నది తేలే దశ కావడంతో ఈ దశపై అందరి చూపు నిలిచింది. మొత్తం మీద అయిదో దశ పోలింగ్ బీజేపీకి అగ్ని పరీక్షగా మారింది.

అయిదో దశ పోలింగ్ కు దేశ వ్యాప్తంగా రంగం సిద్ధమైంది. ఏడు రాష్ట్రాల్లో51 లోక్ సభ నియోజక వర్గాల్లో మే 6వ తేదీన పోలింగ్ జరగనుంది. బీహార్, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ని కొన్ని నియోజక వర్గాలకు పోలింగ్ జరగనుంది. బీహార్ లో అయిదు, జమ్మూ కశ్మీర్ లో రెండు, జార్ఖండ్ లో నాలుగు, మధ్యప్రదేశ్ లో ఏడు, రాజస్థాన్లో 12, ‍యూపీలో 14, పశ్చిమ బెంగాల్ లో ఏడు స్థానాలకూ పోలింగ్ జరుగుతోంది. యూపీలోని వీవీఐపి నియోజక వర్గాలైన అమేథీ, రాయబరేలి లకు కూడా ఈ విడతలోనే పోలింగ్ జరుగుతుండటంతో ఉత్కంఠ పెరుగుతోంది. 2014లో మోడీ ప్రభంజనంలోనూ చెక్కు చెదరని ఈ కాంగ్రెస్ కంచుకోటలు ఈసారి ఏమవుతాయన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. రాహుల్ పై నియోజక వర్గంలో ఉన్న అసంతృప్తిని స్మృతీ ఇరానీ ఎన్ క్యాష్ చేసుకోగలరా లేదా అన్నది ఈ ఎన్నికల్లో తేలనుంది. ఇక 2014లో బీజేపీ ని గెలిపించిన బారియా, మోహన్ లాల్ గంజ్, సీతాపూర్, కైసర్ గంజ్, కౌశంబీ, బాండా, దౌరార్హ స్థానాల్లో మహా ఘట్ బంధన్ గట్టి అభ్యర్ధులను రంగంలోకి దించడంతో బీజేపీకి వణుకు మొదలైంది. అయిదవ దశలో పోలింగ్ ఎదుర్కొంటున్న 14 సీట్లలో బీజేపీ ఈ ఏడు సీట్లను కోల్పోతుందన్న అంచనాలు కమలనాథులను కలవర పెడుతున్నాయి.

ఇక పశ్చిమ బెంగాల్ లో మిగిలిన మూడు దశల పోలింగ్ కోసం కేంద్ర ఆర్మీ రిజర్వుడు బలగాలను రంగంలోకి దించుతున్నారు. బెంగాల్ లోని ఏడు కీలక నియోజక వర్గాల కోసం దాదాపు 578 ఆర్మీ దళాలను దించుతున్నారు. ఈ బలగాలు నేరుగా పోలింగ్ బూత్ లోనే కాపాలాగా నిలబడతాయి. పోలింగ్ బూత్ ల ముందు రాష్ట్ర పోలీసు పహారాను కుదించడంతో టీఎంసీ గొడవ మొదలు పెట్టింది. బెంగాల్ లో జమ్మూ కశ్మీర్ లాగా కేంద్ర ఆర్మీ బలగాలను రంగంలోకి దించడం విమర్శలకు తావిస్తోంది. తొలి దశకు 50 శాతం కేంద్ర బలగాలను అనుమతించిన ఈసీ అయిదో దశ వచ్చే సరికి పూర్తిగా కేంద్ర బలగాల అదుపులోనే పోలింగ్ అనుమతించడంపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర బలగాలను దింపినా, బెంగాల్ లో అన్ని దశల్లోనూ చెదురు మదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ బలగాలను నగరాలకు మాత్రమే పరిమితం చేయాలని తృణమూల్ కోరుతున్నా,, బీజేపీ మాత్రం అన్ని పోలింగ్ బూత్ లలోనూ ఉంచాలని పట్టుబట్టి మరీ డిమాండ్ నేరవేర్చుకుంది. ఓటర్లను ప్రభావితం చేసేందుకే కేంద్రం ఇలా నిర్ణయించిందని మమతా బెనర్జీ మండిపడ్డారు.

ఓటర్లను కమలం గుర్తుకు ఓటేయమని కేంద్ర బలగాలే అడుగుతున్నాయని ఆరోపించారు మమతా. అయిదవ దశ పోలింగ్ ఒకరకంగా మమతా బెనర్జీకి చాలా కీలకమైన దశ. ఇక జమ్మూ కశ్మీర్ లో కూడా అయిదవ దశ పోలింగ్ చాలా కీలకమైనది. ఉగ్రదాడి జరిగిన పుల్వామా,సోఫియాన్ నియోజక వర్గాల్లో పోలింగ్ ఏర్పాట్ల పై భద్రతా దళాలు ప్రత్యేక దృష‌్టి పెట్టాయి. ఈదశలో లద్దాక్, అనంతనాగ్ ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కశ్మీర్ లో ఇది చివరి విడత పోలింగ్ కాదా లద్దాక్ నుంచి మహబూబా ముఫ్తీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అనంత నాగ్ అత్యంత సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతం కావడంతో ఇక్కడ చివరి దశ పోలింగ్ జరుగుతోంది. దేశం మొత్తం మీద ఈ నియోజక వర్గం ఒక్కటే అయిదు దశల్లోనూ పోలింగ్ ఎదుర్కొన్న ఏకైక నియోజక వర్గం. మే 23న ఫలితాలు వెలువడతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories