ముందస్తు ఎన్నికలపై ముడివిప్పిన కేసీఆర్..

ముందస్తు ఎన్నికలపై ముడివిప్పిన కేసీఆర్..
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కొన్ని నెలలు పారిపాలన చేయకుండానే టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. హుటాహుటినా ఆపద్దర్మ ముఖ్యమంత్రి ఆనాడు ప్రెస్...


తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కొన్ని నెలలు పారిపాలన చేయకుండానే టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. హుటాహుటినా ఆపద్దర్మ ముఖ్యమంత్రి ఆనాడు ప్రెస్ మీట్ పెట్టి ముందస్తు ఎన్నికలకు పచ్చజెండా ఉపారు. అయితే అసలు కెసిఆర్ ఎందుకు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాడో ఇప్పటికి ప్రతిప‍క్షాలకు, నేతలకు, ప్రజలకు అంతుచిక్కని ప్రశ్నగా మారిన విషయం తెలిసిందే. కాగా నేడు కాగజ్‌నగర్‌లో ఏర్పాటుచేసిన టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ నోరువిప్పారు. అసలు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో ఎట్టకేలకు కెసిఆర్ వెల్లడించాడు. కెసిఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అడ్డగోలు విమర్శలు పడలేకనే ముందస్తు ఎన్నికలకు వెళ్లామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవద్దనే ముందస్తు ఎన్నికలకు వెళ్లామని కెసిఆర్ స్పష్ఠం చేశారు. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌-టీడీపీలు ఒకవైపు ఉంటే కేవలం నాలుగున్నరేళ్లు అభివృద్ధి చేసిన టీఆర్‌ఎస్‌ మరోవైపు ఉన్నాయన్నారు. వాళ్ల పాలనలో కరెంట్‌ ఎలా ఉండేదో మీకు తెలువదా మరి ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు యాదిపెట్టుకోవాలని తెలిపారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇవ్వగలుతున్నామని‎ కేసీఆర్‌ స్పష్టం చేశారు. పొద్దుగల కరెంట్ పోతే మళ్లీ చికటిపడేదాక కరెంట్ వచ్చేదా అని గి ముచ్చట మీకే వదిలేస్తున్న మీలో మీరే అర్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. అవినీతిని మట్టికలిపి సంపద పెంచుతున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గుడుంబా బట్టీలు, పేకాట క్లబ్బులు లేవని తెలిపారు. తెలంగాణను మళ్లీ కాకులు, గద్దలకు అప్పగించొద్దని ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories