ఎంగ్‌ ఇండియా... ఈసారి ఎగిరి గంతేయ్యాల్సిందే!!

ఎంగ్‌ ఇండియా... ఈసారి ఎగిరి గంతేయ్యాల్సిందే!!
x
Highlights

ఓటే ప్రజాస్వామ్య ఘనత. యువతే ఈ దేశ భవిత. డెమోక్రసీలో వజ్రాయుధం ఓటే. అందుకే నగరంలో యవ ఓటర్లను నమోదును కార్యక్రమం పెంచే లక్ష్యంగా ఎన్నిక కమీషన్...

ఓటే ప్రజాస్వామ్య ఘనత. యువతే ఈ దేశ భవిత. డెమోక్రసీలో వజ్రాయుధం ఓటే. అందుకే నగరంలో యవ ఓటర్లను నమోదును కార్యక్రమం పెంచే లక్ష్యంగా ఎన్నిక కమీషన్ దృష్టిసారించింది.18 ఏళ్లు నిండిన విద్యార్ధులు ను ఓటర్ల ఎన్ రోల్ మెంట్ ను పెంచేలా చర్యలు చేపట్టింది.సుల్తాన్-ఉల్-ఉలూమ్ ఎడ్యూకేషన్ సోసైటీలో అధ్యర్యంలో విద్యార్ధులను ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టింది.ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఏంతటిదో తెలియజెయ్యడం కొసం ఈ కాంపెయిన్ చేపట్టింది జిహెచ్ఎంసి. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతి,యువకులు తప్పని సరిగా ఓటర్ల నమోదు చేసుకోవాలని జిహెచ్ఎంసి అధనపు కమీషనర్ హరి చందన తెలిపారు.

2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా 18-19 సంవత్స రాల మధ్య వయస్సు ఉన్న యువత ఓటర్లుగా నమోదయిన సంఖ్యను, అదే వయసు ఓటర్ల జాబితా 2014 లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే, కేవలం 45శాతం మంది యువత మాత్రమే కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారు. యూత్‌లో 55శాతం మంది వారిపేర్లు ఓటర్లుగా నమోదుకాలేదు. దీంతో ఈసారి యువత ఓటర్ల నమోదును పెంచాలని అటు ఎన్నికల కమిషన్, ఇటు జిహెచ్ఎంసి, ఓటరు నమోదు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. స్టూడెంట్స్‌ను చైతన్యపరిచేందుకు ప్రోగ్రామ్స్ చేపట్టాయి. సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యూకేషన్ సోసైటీ విద్యార్ధులతో, జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ హరి చందన విద్యార్ధులో ముఖాముఖి నిర్వహించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. ఓటర్లగా నమోదు చేసుకోవడంతోపాటు ఓటు వేయడం, సామాజిక బాధ్యతని గుర్తు చేశారు.

విద్యార్ధులు ఓటర్లుగా నమోదు కావడంతో పాటు, ఓటు హక్కును సంపూర్ణంగా వినియోగించున్నప్పుడే, ప్రజాస్వామ్యం గొప్పగా ఉంటుందని స్టూడెంట్స్‌ అంటున్నారు. నగరంలో చదివే విద్యార్ధులు కెరియర్‌తో పాటు ఓటును సామాజిక బాధ్యతగా గుర్తంచాలంటున్నారు. తొలిసారి ఓటు హక్కు కోసం ఎన్‌రోల్‌మెంట్ చేసుకునే అవకాశం వచ్చిందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ, జిహెచ్ఎంసిలో పోలింగ్ శాతం తగ్గుతూ వస్తున్న క్రమంలో, ఈసారి విద్యార్ధులను చైతన్యపరిచి ఓటర్ల నమోదును పెంచాలని జిహెచ్ఎంసి నిర్ణయిచింది. ఈసీ కార్యక్రమాల్లో భాగస్వామ్యంగా ఉంటామంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories