ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా రాజీనామా..

Highlights

న్ఫోసిస్ లిమిటెడ్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ సిక్కా సంచలన నిర్ణయం తీసుకున్నారు. హఠాత్తుగా తన పదవులకు రాజీనామా చేసి సాఫ్ట్‌వేర్ వర్గాలను...

న్ఫోసిస్ లిమిటెడ్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ సిక్కా సంచలన నిర్ణయం తీసుకున్నారు. హఠాత్తుగా తన పదవులకు రాజీనామా చేసి సాఫ్ట్‌వేర్ వర్గాలను విస్మయానికి గురిచేశారు. ఈ మేరకు సంస్థ శుక్రవారం ప్రకటించింది. సిక్కా రాజీనామాను కంపెనీ ఆమోదించింది. తాత్కాలిక ఎండీ, సీఈవోగా యూబీ ప్రవీణ్‌ రావ్‌ను నియమించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే కొత్త ఎండీ, సీఈవోను బోర్డు ఎన్నిక చేస్తుందని పేర్కొంది. విశాల్ సిక్కా 2014 ఏప్రిల్ నుంచి సీఈవోగా కొనసాగుతున్నారు. విశాల్ సిక్కా రాజీనామాతో తాత్కాలిక సీఈవోగా ప్రవీణ‌్ రావు నియమితులయ్యారు. ఈయన 1986 నుంచి ఇన్ఫోసిస్ లో పలు బాధ్యతలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories