logo

శంషాబాద్ లో ఓ యువకుడు హల్ చల్

Highlights

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. శంషాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న భవనంపైకి ఎక్కి...

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. శంషాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న భవనంపైకి ఎక్కి దూకేందుకు ప్రయత్నించాడు. పోలీసులు, స్థానికులు ఎంత వారించినా వినకుండా రెండో అంతస్థు నుంచి దూకేందుకు ప్రయత్నించాడు. చివరకు స్థానికుల సహాకారంతో పోలీసులు యువకుడిని కిందికి దింపారు. దీంతో పెద్ద ముప్పు తప్పింది.

శంషాబాద్ లోని భవార్చి హోటల్ భవనంలోని పై అంతస్థుకి ఎక్కిన ఓ గుర్తుతెలియని యువకుడు దూకుతానని బెదిరించాడు. గమనించిన స్థానికులు అతని కిందకు దింపే ప్రయత్నం చేశారు. అయితే దగ్గరకు వస్తే దూకుతానని బెదిరించడంతో చెసేది లేక పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో ఆ యువకుడు పై నుంచి కింది అంతస్థుకి దూకాడు.

ఇంతలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాకారంతో బిల్డింగ్ వెనక వైపు నుంచి పైకి ఎక్కారు. రెండో అంతస్థుపైన ఉన్న యువకుడిని కిందకు దింపారు. యువకుని అదుపులోకి తీసుకున పోలీసులు విచారణ చేపట్టారు. యువకుడు పోంతనలేని సమాదానాలు చెబుతుండడంతో డ్రగ్స్ సేవించి ఉంటాడని అనుమానిస్తుంన్నారు. యువకుడు రాజస్తాన్ కు చెందిన వాడిగా పోలీసులు భావిస్తున్నారు.

లైవ్ టీవి

Share it
Top