చైనా యాప్స్‌ చెడుగుడు.. అన్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోకుంటే అంతే

Highlights

హలో జస్ట్‌ ఏ మినట్‌ మీ మొబైల్‌లో ఏ యాప్స్‌ ఉన్నాయో తెలుసా మీకు? మెమరీ కార్డు ఉంది కదా అని ఎడాపెడా యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోకండి. కొంప కొల్లేరు...

హలో జస్ట్‌ ఏ మినట్‌ మీ మొబైల్‌లో ఏ యాప్స్‌ ఉన్నాయో తెలుసా మీకు? మెమరీ కార్డు ఉంది కదా అని ఎడాపెడా యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోకండి. కొంప కొల్లేరు చేయడానికి బతుకు బస్టాండ్‌ చేయడానికి యాప్స్‌ వెయిట్‌ చేస్తున్నాయి. చైనా ఫోన్లే కాదు చైనా యాప్స్‌ కూడా కుంపట్లు పెట్టేందుకు కుతకుతలాడుతున్నాయి. అలర్ట్‌గా లేకుంటే అడ్రస్‌ గల్లంతు చేస్తామంటున్నాయి. ఇంతకీ ఏంటీ యాప్స్‌ ఎటాక్‌ కథ.?

ట్రూకాలర్. ఇది ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో కామన్‌గా కనిపించే యాప్‌. షేరిట్‌ కూడా అంతే. మొదటిది ఫోన్‌ చేస్తున్నదెవరో కనిపెడితే రెండోది ఫోటోలో, విజువల్సో ఒక ఫోన్‌ నుంచి ఇంకో ఫోన్‌కు క్షణాల్లో పంపుకునేందుకు వీలుండేది. ఇప్పుడివే దేశ భద్రతకు సంబంధించి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని నిఘావర్గం నిగ్గుతేల్చింది.

సో మన ఫోన్లో ఎక్కువ మెమోరి ఉందని ఎడాపెడా యాప్స్ ఇన్‌స్టాల్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి. అలా ఏమీ లేకుండా అవనసరమైన యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే వ్యక్తిగత సమాచారంతో పాటు వ్యక్తిగతంగా నష్టపోవాల్సి రావటం ఖాయం. అర్థమైంది కదా? డెడ్లీ యాప్స్‌తో బీ కేర్‌ఫుల్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories