గుడ్‌బై చెబుతున్న నేతలు గులాబీలో గుబులు పుట్టిస్తున్నారా?

గుడ్‌బై చెబుతున్న నేతలు గులాబీలో గుబులు పుట్టిస్తున్నారా?
x
Highlights

టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడానికి ముహూర్తం ఖరారైంది. ఇవాళ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో...

టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడానికి ముహూర్తం ఖరారైంది. ఇవాళ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో భేటీ అయిన విశ్వేశ్వర్‌రెడ్డి..గులాబీ పార్టీపై విమర్శలు గుప్పించారు. అయితే త్వరలోనే పలువురు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరతారంటూ టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా మరో బాంబు పేల్చారు.

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియాతో కలిసి విశ్వేశ్వర్‌రెడ్డి రాహుల్‌గాంధీ నివాసానికి వెళ్లారు. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈ భేటీలో వివరించరు. ఈ నెల 23న మేడ్చల్‌ సభలో రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితికి, చేవెళ్ల లోక్‌సభ స్థానానికి కొండా విశ్వేశ్వరరెడ్డి నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇందుకు దారితీసిన పరిస్థితులను వివరించడంతోపాటు ప్రధానంగా ఐదు కారణాలను ప్రస్తావిస్తూ మంగళవారం సాయంత్రం మూడు పేజీల లేఖను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు ఆయన రాశారు.

మహేందర్‌రెడ్డితో వివాదాల కారణంగా తాను టీఆర్ఎస్ పార్టీని వీడలేదని చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అనంతరం విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్‌తోనే తన నియోజకవర్గ సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నట్లు విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీతో మంచి సమావేశం జరిగిందని, కాంగ్రెస్‌ పార్టీలో చేరిన అనంతరం లోక్‌సభ స్పీకర్‌ను కలిసి రాజీనామా సమర్పిస్తానని చెప్పారు. వ్యక్తిగత కారణాల వల్లే టీఆర్ఎస్‌ను వీడానని, మహేందర్‌రెడ్డితో వివాదల వల్ల కాదని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్‌తో సమావేశం అనంతరం ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని కలిశాక చాలా సంతోషంగా ఉందని చెప్పారు. రాజీనామా అంశంపై స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడతానని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. అటు- ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌ పార్టీకి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. వికారాబాద్‌ తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి పార్టీ నేతలకు షాకిచ్చారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా చేసి 24 గంటల కూడా కాకముందే మరోనేత పార్టీని వీడడం గులాబీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి తీరు నచ్చకనే తాను పార్టీకి రాజీనామా చేసినట్లు సంజీరావు తెలిపారు. తాను నమ్మిన వారే నట్టేటముంచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి వికారాబాద్‌ నుంచి గెలిచిన సంజీవరావుకు ఈసారి టీఆర్‌ఎస్‌ టికెట్‌ నిరాకరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories