యూట్యూబ్‌ తో రూ.100 కోట్లు సంపాదించిన 26ఏళ్ల కుర్రాడు

Highlights

ఓ 26ఏళ్ల కుర్రాడ్ యూట్యూబ్ ప్రపంచాన్ని దున్నేస్తున్నాడు. తనకున్న అనుభవంతో యూట్యూబ్ లో ఏకంగా రూ.100కోట్లకు పైగా సంపాదిస్తున్నాడు. తాను చేసేదే యూట్యూబ్...

ఓ 26ఏళ్ల కుర్రాడ్ యూట్యూబ్ ప్రపంచాన్ని దున్నేస్తున్నాడు. తనకున్న అనుభవంతో యూట్యూబ్ లో ఏకంగా రూ.100కోట్లకు పైగా సంపాదిస్తున్నాడు. తాను చేసేదే యూట్యూబ్ లో తాను చేసిన వీడియోల్ని పోస్ట్ చేయడమే .

టెస్కో మాజీ ఉద్యోగి డానియల్ మిడిల్ టన్ కు గేమింగ్ పై మక్కువ ఉండడంతో దాన్నే సంపాదన మార్గంగా ఎంచుకున్నాడు. అలా మిడిల్ టామ్ అనే యూట్యూబ్ ఛానల్లో డాన్ టీడీఎంగా సుప‌రిచితుడైన అత‌గాడు కంప్యూట‌ర్ గేమ్స్ ఆడుతూ.. నెక్ట్స్ లెవెల్‌కు ఎలా వెళ్లాలో వివ‌రిస్తూ వీడియోలు పోస్ట్ చేయ‌టంలో పెద్ద తురంఖాన్. ఈ కార‌ణంతో ఫేమ‌స్ అయిన అత‌గాడు త‌క్కువ స‌మ‌యంలోనే ఫేమ‌స్ అయిపోయారు.

కంప్యూట‌ర్ గేమ్స్ లో త‌ర్వాతి ఎత్తుకు వెళ్లాలో చెప్పే వీడియోల‌కు యూట్యూబ్‌లో పాపులార్టీ ఉండ‌టంతో అత‌నికి పెద్ద ఎత్తు ఆదాయం ల‌భించింది. యూట్యూబ్‌లో అత‌ని ఖాతాకు 17 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉండ‌టం గ‌మ‌నార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories