logo
సినిమా

తస్సాదియ్యా.. చెర్రీ చించేశాడు

X
Highlights

రామ్‌ చరణ్‌ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్నా చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ చిత్రానికి ...

రామ్‌ చరణ్‌ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్నా చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఇటివల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్, ఫస్ట్‌సాంగ్ అభిమానుల్లో దుమ్మరేపుతుంది. తాజాగా ఈ సినిమా నుండి రెండో పాట తస్సాదియ్యా లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేశారు. అయితే 4 నిమిషాల 25 సెకనుల నిడివితో కూడిన ఈ పాట అభిమానులను ఉర్రుతలుగిస్తుంది. వీడియోలో చెర్రీ, కియారా లుక్స్, డాన్స్ మెగా అభిమానులను మంత్రముగ్దులను చేసింది. మొత్తానికి ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story