ముంబై వన్డేలో టీమిండియా భారీస్కోరు

ముంబై వన్డేలో టీమిండియా భారీస్కోరు
x
Highlights

ముంబై వన్డేలో టీమిండియా సెంచరీల జోరు, పరుగుల హోరుతో ప్రత్యర్థి ఎదుట 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. బ్రబోర్న్ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈమ్యాచ్...

ముంబై వన్డేలో టీమిండియా సెంచరీల జోరు, పరుగుల హోరుతో ప్రత్యర్థి ఎదుట 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. బ్రబోర్న్ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈమ్యాచ్ లో టాస్ నెగ్గి...ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 377 పరుగుల భారీస్కోరు సాధించింది. కెప్టెన్ విరాట్ కొహ్లీ విఫలమైనా...ఓపెనర్ రోహిత్ శర్మ, రెండోడౌన్ అంబటి రాయుడు స్ట్రోక్ ఫుల్ సెంచరీలు సాధించడంతో.. టీమిండియా మ్యాచ్ విన్నింగ్ స్కోరు నమోదు చేయగలిగింది. వన్డే క్రికెట్ హిట్ మాన్ రోహిత్ శర్మ 162 పరుగుల స్కోరుతో...21వ సెంచరీ సాధించగా...తెలుగుతేజం అంబటి రాయుడు...8 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 100 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. ఐదుమ్యాచ్ ల ఈ సిరీస్ లోని మొదటి మూడు వన్డేలు ముగిసే సమయానికి రెండుజట్లు చెరో మ్యాచ్ నెగ్గి 1-1తో సమఉజ్జీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో నెగ్గడం ద్వారా ఆతిథ్య టీమిండియా...సిరీస్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories