సంజయ్‌ విచార్‌ మంచ్‌. ఈ పార్టీ గురించి మీకు తెలుసా!!

సంజయ్‌ విచార్‌ మంచ్‌. ఈ పార్టీ గురించి మీకు తెలుసా!!
x
Highlights

అవి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్న రోజులు. ఏదో ఒక పార్టీతో పొత్తుంటే బావుంటుందని నందమూరి తారక రామారావు తలపోస్తున్న సమయం. 1982, మార్చి 29న...

అవి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్న రోజులు. ఏదో ఒక పార్టీతో పొత్తుంటే బావుంటుందని నందమూరి తారక రామారావు తలపోస్తున్న సమయం. 1982, మార్చి 29న ఆవిర్బవించింది టీడీపీ. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షంగా పాలిస్తున్న కాంగ్రెస్‌ను మట్టికరిపించాడు ఎన్టీఆర్. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే, ఆఖండ విజయంతో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు. అయితే, పార్టీ ఆవిర్భావ సమయంలోనే అనేక పార్టీలతో పొత్తుకు ప్రయత్నించారు ఎన్టీఆర్‌. ఎందుకంటే, అప్పుడే సినిమా కెరీర్‌ను వదిలివచ్చిన ఎన్టీఆర్, ఇందిరాతో పాటు రాష్ట్రంలో బలమైన నాయకులైన భవనం వెంకట్రామిరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి వంటివారిని ఎదుర్కోవాలంటే, పొత్తుల అవసరం ఉందని గుర్తించారు.

మొదట ఎన్టీఆర్‌ సంప్రదించిన పార్టీలు....సీపీఐ, సీపీఎం. అయితే, అన్నగారి ప్రభంజనాన్ని తక్కువగా అంచనా వేశాయి లెఫ్ట్‌ పార్టీలు. మొత్తం 294 అసెంబ్లీ సీట్లలో ఏకంగా 150 సీట్లు డిమాండ్లు చేశాయి. అయితే తన హామీలను అమలు చేయాలంటే, మెజారిటీ స్థానాలు కావాలని ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. తర్వాత జనతా పార్టీ గడప తొక్కారు. బీజేపీలతోనూ మాట్లాడారు. కానీ ఏ పార్టీ కూడా ఒప్పుకోలేదు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కూటమి కట్టాలని భావించిన ఎన్టీఆర్‌, తన ప్రయత్నాలన్నీ విఫలమవుతుండటంతో, మొదట్లోనే కొంత కలత చెందారు. అప్పుడే ఒక చిన్న పార్టీ, చిమ్మచీకట్లో చిరుదివ్వెలా ఎన్టీఆర్‌కు కనిపించింది.

సంజయ్‌ గాంధీ సతీమణి, మేనకా గాంధీ స్థాపించిన పార్టీ సంజయ్ విచార్‌ మంచ్. దేశమంతా పార్టీని విస్తరించాలనుకుంటున్న మేనకా, ఎన్టీఆర్ ప్రతిపాదించిన పొత్తుకు సరేనన్నారు. పార్టీ పెట్టిన తొలి ఎన్నికలోనే, సంజయ్ విచార్ ‌మంచ్‌ లాంటి పార్టీతో జట్టుకట్టారు ఎన్టీఆర్. 289 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తే, సంజయ్‌ విచార్‌ మంచ్‌కు ఐదు సీట్లు కేటాయించారు. 202 స్థానాల్లో విజయఢంకా మోగించి, ఎన్టీఆర్‌ చరిత్ర సృష్టించారు. సంజయ్‌ విచార్‌ మంచ్‌ ఐదు సీట్లకు పోటీ చేసి, నాలుగింటిలో గెలుపొంది, అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ విధంగా ఆవిర్భావం టైంలోనే, ఒక చిన్న పార్టీతో పొత్తు కట్టింది తెలుగుదేశం.

సంజయ్‌ విచార్‌ మంచ్‌ను కొనసాగించలేకపోయారు మేనకా గాంధీ. బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆమె కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అదీ సంజయ్‌ విచార్ మంచ్‌ పార్టీ, తెలుగుదేశం పొత్తు ఫ్లాష్‌బ్యాక్‌ స్టోరి.

Show Full Article
Print Article
Next Story
More Stories