logo
సినిమా

అమ్మాయిలకు హీరో సల్మాన్‌ఖాన్ సలహా

అమ్మాయిలకు హీరో సల్మాన్‌ఖాన్ సలహా
X
Highlights

మన దేశంలో అమ్మాయిలు, వివాహిత మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతేలేకుండా పోతోంది. పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన ...

మన దేశంలో అమ్మాయిలు, వివాహిత మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతేలేకుండా పోతోంది. పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కామాంధులు బరి తెగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు మహిళల రక్షణ కోసం 'హిమ్మత్ యాప్'ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్ ను బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా ఢిల్లీ విమానాశ్రయంలో లాంచ్ చేయించారు.

అమ్మాయిలందరూ పోలీసు హిమ్మత్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని రక్షణ పొందాలని సల్మాన్ తన అభిమానులను కోరారు. కమిషనర్ సంజయ్ బేనివాల్ మాట్లాడుతూ, రక్షణ కోసం ప్రతి ఒక్కరు ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు. సల్మాన్ తోపాటు బాలీవుడ్ నటీనటులు అలియాభట్, సిద్ధార్థ మల్హోత్రా, కరీనాకపూర్, షబానా అజ్మీ, విద్యాబాలన్, ఇర్ఫాన్ లతో పోలీసు కార్యక్రమాలకు ప్రచారం చేస్తామని ఢిల్లీ పోలీసు ప్రజాసంబంధాల అధికారి మాధూర్ వర్మ చెప్పారు.

Next Story