అవ్వను అనాధను చేసిన మూఢనమ్మకాలు

Highlights

చనిపోయిన మనిషి బతకడం అనేది సినిమాల్లో చూస్తాం. కానీ, ఆ అవ్వ నిజంగానే చచ్చి బతికింది. అయితే, ఈ సంతోషాన్ని ఆమెకు మిగల్చలేదు కుటుంబసభ్యులు. మూడనమ్మకాలతో...

చనిపోయిన మనిషి బతకడం అనేది సినిమాల్లో చూస్తాం. కానీ, ఆ అవ్వ నిజంగానే చచ్చి బతికింది. అయితే, ఈ సంతోషాన్ని ఆమెకు మిగల్చలేదు కుటుంబసభ్యులు. మూడనమ్మకాలతో ఆ వృద్దురాలి బతుకును నిత్యం నరకంలా మార్చారు.

మనిషి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. టెక్నాలజీ యుగంలోనూ కొందరు మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మి అత్యంత అమానుషంగా వ్యవహరిస్తున్నారు. అంధ విశ్వాసాలతో కన్నవారి పట్లే కర్కశంగా వ్యవహరిస్తున్నారు. మన చూస్తున్న ఈ వృద్ధురాలి పేరు శకుంతల. వయసు 70 సంవత్సరాలు. నివాసం ఉండేది సిరిసిల్లలో రోడ్డు పక్కన ఓ చెట్టు కింద. అందరూ ఉండి కూడా ఈ అవ్వ ఇలా అనాథలా ఎందుకు బతుకుతుందో తెలుసుకోవాలంటే మూడేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన గురించి తెలుసుకోవాలి.

సరిగ్గా మూడేళ్ల క్రితం శంకుతల చనిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు స్మశానానికి తీసుకుని వెళ్తుండగా మార్గం మధ్యలో లేచి కూర్చుంది. దీంతో కుటుంబసభ్యులు మొదట ఆశ్చర్యానికి గురైనా తర్వాత, చనిపోయి బతికిన మనిషి ఇంటికి తీసుకెళ్లడం అరిష్టమని ఆమెను రోడ్డు పక్కనే వదిలేశారు. తమకు అశుభం జరుగుతుదనే మూడనమ్మకంతో నవ మోసాలు మోసిన కన్న తల్లినే అనాథలా రోడ్డుపైనే పడేశారు. దీంతో ఈ వృద్దురాలి పరిస్థితి అప్పటి నుంచి దయనీయంగా మారింది.

ఇద్దరు కొడుకులు ఉన్నా రోడ్డు పక్కన ఓ చెట్టుకింద అనాథలా బతుకుతుంది. దయతలిచి దారిన పోయేవాళ్లు ఎమైనా పెడితే, తిని కడుపు నింపుకుంటోంది. పేగు తెంచుకు పుట్టిన కొడుకులు మూఢనమ్మకాలతో తనను రోడ్డుపనే వదిలేస్తే జీవచ్ఛవంలా బతుకుతోంది.

అయినవారు కాదన్నా, ఆనాథలా బతుకుతున్న ఈ అవ్వకు ఇప్పుడు మరో కొత్త కష్టం వచ్చింది. సిరిసిల్లలోని అభివృద్ధి పనుల్లో భాగంగా.ఇనాళ్లు వృద్ధురాలికి ఆశ్రయం ఇస్తున్న చెట్టును తొలగించనున్నారు.
దీంతో ఎక్కడికి వెళ్లి తల దాచుకోవాలో తెలియని పరిస్థితి ఈ అవ్వది. అధికారులుగానీ, ప్రభుత్వంగానీ స్పందిం
చి ఈ వృద్ధురాలిని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories