Top
logo

సచిన్ జ్ఞాపకాలలో క్రికెట్ లోకం

Highlights

క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్, అభినవ బ్రాడ్మన్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ నాలుగేళ్ల క్రితం ఇదేరోజున హోంగ్రౌండ్ ముంబై...

క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్, అభినవ బ్రాడ్మన్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ నాలుగేళ్ల క్రితం ఇదేరోజున హోంగ్రౌండ్ ముంబై వాంఖెడీ స్టేడియంలో విండీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా రిటైరయ్యాడు. మాస్టర్ ఆట నుంచి వీడ్కోలు తీసుకొని అప్పుడే నాలుగేళ్లయ్యిందా అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 16 ఏళ్ళ చిరుప్రాయంలోనే టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేసిన సచిన్ తన 22 ఏళ్ల అంతర్జాతీయ కెరియర్ లో 100 సెంచరీలతో మొత్తం 30వేలకు పైగా పరుగులు సాధించి తనకు తానే సాటిగా నిలిచాడు. వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో డజన్ల కొద్దీ ప్రపంచ రికార్డులు ఇప్పటికీ సచిన్ పేరుతోనే ఉన్నాయి.

11 ఏళ్ల వయసులోనే బ్యాట్ పట్టిన సచిన్ ఆ తర్వాత నుంచి క్రికెట్టే తన జీవితంగా చేసుకొన్నాడు. తన అంతర్జాతీయ కెరియర్ లో 200 టెస్టులు, 463 వన్డే మ్యాచ్ లు ఆడిన మాస్టర్ టన్నుల కొద్దీ పరుగులు, సెంచరీలు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సైతం సంపాదించుకొన్నాడు. 2013 నవంబర్ 16న తన ఊపిరిగా భావించే క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ లాంటి క్రికెటేతర క్రీడల్ని తనవంతుగా ప్రోత్సహిస్తూ రిటైర్మెంట్ జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నాడు.

Next Story