రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌.. రోడ్డెక్కిన కార్యకర్తలు

x
Highlights

రేవంత్ రెడ్డి అరెస్ట్‌తో మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డికి మద్ధతుగా పలు చోట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌తో మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డికి మద్ధతుగా పలు చోట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రేవంత్ రెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ జడ్చర్లలో కాంగ్రెస్ అభ్యర్ధి మల్లరవితతో పాటు మహాకూటమి సభ్యులు నిరసనకు దిగారు. జాతీయ రహదారిపై భైఠాయించిన నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు కార్యకర్తలు ఆత్మహత్యకు యత్నించడం తీవ్ర ఉద్రిక్తత రేగింది. పరిస్ధితులు అదుపు తప్పడంతో జోక్యం చేసుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories