కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ ఏకగ్రీవం
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం రాహుల్ మాత్రమే నామినేషన్ ...
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం రాహుల్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడం, నామినేషన్ ఉపసంహరణ గడువు ఈ మధ్యాహ్నం మూడు గంటలతో ముగియడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ నెల 16న ఆయన సోనియా గాంధీ నుంచి పార్టీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో 19 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఓ తరం నుంచి మరో తరానికి చేతులు మారనున్నాయి. గాంధీ-నెహ్రూ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన ఐదో వ్యక్తిగా రాహుల్ గాంధీ నిలుస్తున్నారు. అత్యధిక కాలం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న రికార్డు సోనియా గాంధీ పేరిట ఉంది.
రాహుల్ ఎన్నికను కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మూలపల్లి రామచంద్రన్ ప్రకటించారు. ఒక అభ్యర్థి పేరు మీదే మొత్తం 9 నామినేషన్లు వచ్చాయి. రాహుల్‌కు పోటీగా ఎవరూ లేరు. దీంతో ఆయననే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నాం. ఈ నెల 16న ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌లో అధికారికంగా రాహుల్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడుతారు అని రామచంద్రన్ తెలిపారు. రాహుల్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఏఐసీసీ కార్యాలయం దగ్గర కార్యకర్తలు టపాసులు కాల్చి, స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నారు.
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
9 Aug 2022 4:27 AM GMTబీహార్‌లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMTస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు
9 Aug 2022 3:09 AM GMT