పోలవరానికి వైసీపీ, జనసేన పోటాపోటీ యాత్రలు

Highlights

పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకి వైసీపీ, జనసేన పోటాపోటీ యాత్రలు చేపట్టాయి. ఇవాళ వైసీపీ నేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలవరానికి వెళ్తున్నారు. పోలవరం...

పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకి వైసీపీ, జనసేన పోటాపోటీ యాత్రలు చేపట్టాయి. ఇవాళ వైసీపీ నేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలవరానికి వెళ్తున్నారు. పోలవరం నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివాదాన్ని అనుకూలంగా మలచుకొనేందుకు వైసీపీ నేతలు నేడు బస్ యాత్ర చేపడుతున్నారు. మరోవైపు జనసేనాని పవన్ కూడా హఠాత్తుగా ఈ రోజే పోలవరానికి బయల్దేరుతున్నారు. అయితే వైసీపీ పోలవరం యాత్రను ప్రకటించగానే పవన్ కళ్యాణ్ కూడా తాను ప్రాజెక్ట్ ను సందర్శిస్తానని చెప్పడం వెనుక రహస్య ఎజెండా ఉందని అభిప్రాయ పడుతున్నారు వైసీపీ నేతలు. వైసీపీకి పోలవరం మైలేజ్ రాకూడదనే అధికార పార్టీ పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దింపిందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి అధికార పార్టీకి ఇబ్బంది వచ్చినపుడే బయటికొస్తారని.. ఇపుడు కూడా అదే వ్యూహంతో వస్తున్నారు తప్ప పోలవరం ప్రాజెక్ట్ పై చిత్తశుద్ధి లేదని విమర్శస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories