స్పీచ్‌లో బేస్‌... మాటల్లో గ్రేస్‌.. ప్రజల్లో క్రేజ్‌... పవన్‌ ఈక్వేషన్స్‌ వేరే ఉన్నాయ్‌!!

స్పీచ్‌లో బేస్‌... మాటల్లో గ్రేస్‌.. ప్రజల్లో క్రేజ్‌... పవన్‌ ఈక్వేషన్స్‌ వేరే ఉన్నాయ్‌!!
x
Highlights

స్పీచ్‌లో బేస్.. మాట్లలో గ్రేస్.. ప్రజల్లో క్రేజ్.. మాటలతోనే తూటాలు పేలుతున్నాయి.. జనసేనాని పవన్ కల్యాణ్ పోరాట యాత్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.....

స్పీచ్‌లో బేస్.. మాట్లలో గ్రేస్.. ప్రజల్లో క్రేజ్.. మాటలతోనే తూటాలు పేలుతున్నాయి.. జనసేనాని పవన్ కల్యాణ్ పోరాట యాత్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.. అధికార, ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుడుతోంది.. జనసేనాని దండయాత్ర మొదలుపెట్టారు.. మిస్సైల్ లాంటి పదాలతో.. ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తూ.. ఉత్తరాంధ్ర యూత్‌ గుండెల్లో జనసేన ముద్ర పడేలా కేక పుట్టిస్తూ దూసుకు పోతున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం‌లో కొనసాగుతోంది.. పోరాట యాత్రకు అటు పవన్ అభిమానులు ఇటు స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. నేరుగా ప్రజల వద్దకు వెళ్తూ, ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు జనసేనాని. ఎలాంటి కష్టం వచ్చిన ప్రజలకు జనసేన అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు పవన్..

కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయించుకోవడంలో టీడీపీ.. అధికార పార్టీని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన వైసీపీ తమ బాధ్యతను విస్మరించాయన్నారు.. అధికార, ప్రతిపక్షాలను నిలదీస్తున్న జనసేనాని.. మిస్సైల్ లాంటి మాటలతో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్నారు.. తెలుగుదేశం పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన పవన్.. చంద్రబాబుపై ప్రశ్నలు సంధిస్తూ టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.. ఇక బీజేపీపై కూడా పవన్ తనదైన శైలిలో విరుచుకు పడుతున్నారు.

పవన్ పోరాట యాత్రకు ప్రజ‌ల‌ నుండి పెద్ద యెత్తున మ‌ద్దత్తు లభిస్తోంది.. యాత్ర నిర్వహిస్తూనే స్థానిక స‌మ‌స్యల‌పై ప‌వ‌న్ జోరుగా స్పందిస్తున్నారు. ఇత‌ర రాజ‌కీయ నాయకులు జ‌న‌సేన పార్టీ గురించి, జ‌న సైనికుల గురించి ఉదాసీనంగా వ్యవహ‌రిజస్తే సహించేది లేదంటూ హెచ్చరిస్తున్నారు.. 2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తామని.. ప్రజలు తమను ఆదరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్న పవన్ కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు... పోరాట యాత్రకు పెద్దఎత్తున ప్రజలు, కార్యకర్తలూ పాల్గొంటున్నారు..

మొత్తానికి 2019 ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తామ‌ని ప్రకటించిన జనసేనాని.. పోరాట యాత్ర విజయవంతం అయితే ఆంధ్రప్రదేశ్ లో కింగ్ మేకర్ గా మారుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో టీడీనీ, వైసీపీలకు మెజారిటీ రాకపోతే జనసేన నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి..

Show Full Article
Print Article
Next Story
More Stories