logo
జాతీయం

బిజీబీజీగా మోడీ షెడ్యూల్

Highlights

రేపు జీఈఎస్ సదస్సుకు, మెట్రో రైలు ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని మోడీ షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని మోడీ రేపు ...

రేపు జీఈఎస్ సదస్సుకు, మెట్రో రైలు ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని మోడీ షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని మోడీ రేపు మధ్యాహ్నం 1.10కి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అటునుంచి మధ్యాహ్నం 2.05కు మియాపూర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 2.15 నుంచి 2.23కి మెట్రో పైలాన్‌ను ఆవిష్కరించి మెట్రో రైలును ప్రారంభిస్తారు. తర్వాత అక్కడ ఏర్పాటుచేసిన ఆడియో విజువల్ ప్రదర్శనను తిలకించి మెట్రో రైలు బ్రోచర్‌, యాప్‌‌ను విడుదల చేస్తారు. రెండున్నర నుంచి 2.40 మధ్య మోడీ మియాపూర్‌ నుంచి కూకట్‌పల్లి వరకు మెట్రో రైలులో ప్రయాణించి తిరిగి అదే రైలులో మియాపూర్‌ చేరుకుంటారు.

రేపు మధ్యాహ్నం 3.15కి హెచ్‌ఐసీసీ చేరుకునే మోడీ రాత్రి 7.25 వరకు ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడ ప్రారిశ్రామిక వేత్తలతో భేటీలు, రౌండ్ టేబుల్ కార్యక్రమాల్లో పాల్గొని జీఈఎస్‌లో 20 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. రాత్రి ఏడున్నరకి హెచ్‌ఐసీసీ నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌కి రోడ్డు మార్గంలో చేరుకుంటారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రధాని మోడీ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే విందులో ఇవాంకాతో కలిసి పాల్గొంటారు. తర్వాత ఫలక్‌నుమా ప్యాలెస్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి 10.25 శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీ వెళ్తారు.

Next Story