Top
logo

నాటుకున్న నాగర్‌కర్నూలు చిక్కులు విప్పేదెవరు?

నాటుకున్న నాగర్‌కర్నూలు చిక్కులు విప్పేదెవరు?
X
Highlights

నాగర్‌కర్నూలు జిల్లాను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సహజ వనరులున్నా......

నాగర్‌కర్నూలు జిల్లాను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సహజ వనరులున్నా... ఉపయోగించుకోలేని పరిస్థితి. నిజాం రాజుల కాలం నుంచి ఉన్న జిల్లాను పాలమూరు జిల్లాలో కలిపినా... తర్వాత ప్రత్యేక జిల్లాగా మార్చినా... అప్పటి నుంచి ఇప్పటి దాకా ప్రజల జీవనస్థితి గతుల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అసలేంటి? నాగర్‌కర్నూలు నడుమ అల్లుకున్న సమస్యలేంటి? ప్రజల డిమాండ్లేంటి? ఇదే ఇవాళ్లి జిల్లా రౌండప్‌.

అచ్చంపేట, కల్వకుర్తిలతో కలపి నాగర్‌కర్నూలు జిల్లాను చేసింది ప్రభుత్వం.


నాగర్‌కర్నూలు నియోజకవర్గంలో లక్షా 97 వేల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 98 లక్షలుపైన పురుషులు, 99 లక్షల మహిళలు ఉండగా 15,000 వేల పైచిలుకు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. గతంలో 99 గ్రామ పంచాయతీలు ఉండగా నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటుతో మొత్తంగా 140 గ్రామపంచాయతీలకు పెరిగాయి. నాగర్‌కర్నూలు నియెజకవర్గంలో 2014 ఎన్నికల్లో లక్షా 92 వేలు మంది ఓటర్లకు గాను లక్షా 51 వేలు 117 ఓట్లు పోలవగా, టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్‌రెడ్డికి 62 వేల470 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ళ దామోదర్‌రెడ్డి 48 వేల 035 ఓట్లు వచ్చి రెండో స్థానంలో నిలిచారు.

నాగర్‌కర్నూల్‍ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు చూస్తే... పరిశ్రమలు లేని ప్రాంతంగా నాగర్‌కర్నూలును చెప్పుకోవచ్చు. దీంతో ఉపాధి కూడా లేకుండాపోయింది ఇక్కడి యువతకు. ఉన్నత చదువులకు ఇంజినీరింగ్ కళాశాల కూడా ఇక్కడ లేక విద్యార్థులు చదువుల కోసం వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలో ఎక్కడ కూడా ఇంజనీరింగ్ కళాశాల లేకపోవడం దురదృష్టకరం. నాగర్‌కర్నూలు జిల్లా ఏర్పడిన తర్వాత కొత్తగా కలెక్టరేట్‍ కార్యాలయం, ఎస్పీ కార్యాలయాలు పాత భవనాల్లోనే కొనసాగుతున్నాయి.. కలెక్టరేట్‍ నూతన భవనం జిల్లా కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసేందుకు భవన పనులు ప్రారంభమయ్యాయి. అయితే జిల్లా కేంద్రంలోనే నిర్మించాలన్నది స్థానికుల డిమాండ్. ఎన్నికల సమయంలో ఇచ్చిన డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేవలం శంకుస్థాపనకే పరిమితమయ్యాయి. జిల్లా ఆస్పత్రి భవనం బాగున్నా... సిబ్బంది కొరతతో ఇబ్బందులు తప్పట్లేదు. రోడు వెడల్పు చేపట్టకపోవడం కూడా సమస్యగా మారింది.

ఇక కల్వకుర్తి. ఎన్టీఆర్‌ను ఓడించిన ఘనత కల్వకుర్తి నియోజకవర్గం ఓటర్లది. మొత్తం ఓటర్లు లక్షా 96 వేల 198 ఓటర్లు కాగా అందులో లక్షా ఒక వేయి 593 పురుషులు, 94 వేల 583 మహిళా ఓటర్లు. ఈ నియోజకవర్గానికి
NTRని ఓడించిన చరిత్ర ఉంది..
1989లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన చిత్తరంజన్‌దాస్ చేతిలో ఎన్టీఆర్‌ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు.. 100 పడకల ఆసుపత్రి కల్వకుర్తి ప్రజలకు కలగానే మిగిలింది. పేరుకే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కానీ చాలా గ్రామంలకు సాగునీరు అందలేదు. డబులబెడ్‌రూమ్స్ పథకం ద్వారా నియోజకవర్గంలోని ఒక్క లబ్ధిదారుడు లాభపడలేదు. నియోజకవర్గం మొత్తంలో డబుల్‍ బెడ్‌రూం పథకం కనీసం భూమిపూజకు కూడా నోచుకోకపోవడం ఇంకా దారుణమంటున్నారు ప్రజలు. నియోజకవర్గం మొత్తంగా తాగునీటి సమస్య ఉంది. హైదరాబాద్‌కు సమీపంలోనే ఉన్నా ఉపాధి కరువు ఉంది.

అచ్చంపేట నియోజకవర్గానికి వస్తే.. నల్లమలో సగం వరకు అంతర్భంగా ఉంటుంది ఈ నియోజకవర్గం. అచ్చంపేట పేదలు డబుల్‍ బెడ్రూమ్‌ ఇళ్ల కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
భూమి లేని దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడ కూడా ఈ నియోజకవర్గంలో పంచలేదు. ఈ ప్రాంతంలో గిరిజనులు చెంచులు ఎక్కువగా ఉన్నారు.
అచ్చంపేట నియోజకవర్గంలోని గిరిజనులు ఫారెస్టు భూములు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. కానీ వారికి పట్టాలిస్తామన్న ప్రభుత్వం ఇంతవరు పట్టాలు ఇవ్వకపోగా, ఆ భూమికి రైతుబంధు పథకం వర్తింపజేయలేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. రోడ్లు లేని గిరిజన గ్రామాలు, మంచినీటి సౌకర్యం లేని మరెన్నో గ్రామాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి.
అచ్చంపేట పట్టణానికి కనీసం డిగ్రీ కళాశాల కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇలా ఎలా చూసినా... నాగర్‌కర్నూలును సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరకపోగా... మరిన్ని సమస్యలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని జిల్లా ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు.

Next Story