ధోనీ చుట్టూ తిరుగుతున్న భారత క్రికెట్

Highlights

భారత క్రికెట్ ప్రస్తుతం జార్ఖండ్ డైనమైట్ , మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చుట్టే తిరుగుతోంది. ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో భారతజట్టు నుంచి ధోనీ...

భారత క్రికెట్ ప్రస్తుతం జార్ఖండ్ డైనమైట్ , మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చుట్టే తిరుగుతోంది. ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో భారతజట్టు నుంచి ధోనీ తప్పుకొని యువక్రికెటర్లకు అవకాశం ఇవ్వాలంటూ ఓవైపు మాజీ క్రికెటర్లు, క్రికెట్ కామెంటీటర్లు వీవీఎస్. లక్ష్మణ్, అజిత్ అగార్కర్ డిమాండ్ చేస్తుంటే మరోవైపు భారత మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం మహీని వెనకేసుకొస్తున్నారు. ఎంతోమంది యువక్రికెటర్లకు అవకాశం కల్పించడంతో పాటు ప్రోత్సహించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా అంటూ వీరూ సమర్థించాడు. మరోవైపు 30 సంవత్సరాలు పైబడిన క్రికెటర్ల లోటుపాట్లు, వైఫల్యాలను ఎత్తి చూపడం భారత క్రికెట్లో సాధారణవిషయమేనంటూ విశ్వవిఖ్యాత కామెంటీటర్ గవాస్కర్ కొట్టిపడేశారు. ధోనీ లాంటి అపారఅనుభవం ఉన్న క్రికెటర్ అవసరం టీమిండియాకు ఇంకా ఉందని తేల్చి చెప్పారు. ఏదిఏమైనా భారత క్రికెట్ కు విలక్షణ సేవలు అందించిన ధోనీని వేలెత్తి చూపేవారు కొందరైతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ సమర్థించేవారు మరికొందరు. భారత క్రికెట్ అంటే ఇదేనేమో మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories