మాతృత్వానికే మచ్చ.. అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని కుమార్తెకు తల్లి చిత్రహింసలు

Highlights

హైదరాబాద్‌ ఎస్సార్‌నగర్‌ పీఎస్‌ పరిధిలోని వెస్ట్‌ శ్రీనివాసనగర్‌లో దారుణం జరిగింది. ఓ కన్నతల్లి మాతృత్వానికి మచ్చతెచ్చే పని చేసింది. తన అక్రమ...

హైదరాబాద్‌ ఎస్సార్‌నగర్‌ పీఎస్‌ పరిధిలోని వెస్ట్‌ శ్రీనివాసనగర్‌లో దారుణం జరిగింది. ఓ కన్నతల్లి మాతృత్వానికి మచ్చతెచ్చే పని చేసింది. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని నాలుగేళ్ల కుమార్తెను తల్లి చిత్రహింసలకు గురిచేసింది కాలుతున్న పెనంపై కూర్చోబెట్టడంతో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. చిన్నారి రోదన విని స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చిన్నారిని కాపాడి చైల్డ్‌లైన్‌ సంస్థకు అప్పగించారు. చిన్నారిని కాలుతున్న పెనంపై కూర్చోబెట్టిన తల్లి లలితను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గత కొన్నిరోజులుగా లలిత వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అక్రమ సంబంధం కారణంగానే చిన్నారిని వదిలించుకునేందుకు ఆమె ఈ చర్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories