logo
జాతీయం

రేప్‌ కేసులపై సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

రేప్‌ కేసులపై సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
X
Highlights

ఎప్పడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కడం బీజేపీ నేతలకు కొత్తేమి కాదు అయితే తాజాగా మరోసారి హరియాణా...

ఎప్పడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కడం బీజేపీ నేతలకు కొత్తేమి కాదు అయితే తాజాగా మరోసారి హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 80 నుంచి 90 శాతం రేప్‌, ఈవిటీజింగ్‌ కేసుల్లో బాధిత మహిళలు ఏదైనా సమస్య లేదా వాగ్వాదం జరిగినప్పుడే.. కేసులు పెడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో భగ్గుమన్నాయి. మనోహర్ లాల్ మహిళాలోకానికే వ్యతిరేకి అని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయి కలిన వ్యక్తి అత్యాచారాలను ఆరికట్టాల్సిందిపోయి. పైగా దానికి మహిళలే బాధ్యులంటూ మాట్లాడటం సిగ్గుచేటున్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలే ఈ విధంగా ఉంటే రాష్ట్రంలో బాలికల భద్రత ఎక్కడిది? అని ప్రశ్నించారు.

Next Story