Top
logo

అసలు రాఫెల్‌ జెట్స్‌పై ఏం జరిగింది?

అసలు రాఫెల్‌ జెట్స్‌పై ఏం జరిగింది?
X
Highlights

ఇలా రాఫెల్‌ యుద్ధ విమానం గగనతలంలో చక్కర్లు కొట్టకముందే, అనుమానాలు, ఆరోపణాస్త్రాలు ప్రపంచమంతా చుట్టేస్తున్నాయి. ...

ఇలా రాఫెల్‌ యుద్ధ విమానం గగనతలంలో చక్కర్లు కొట్టకముందే, అనుమానాలు, ఆరోపణాస్త్రాలు ప్రపంచమంతా చుట్టేస్తున్నాయి. ప్రజాధనాన్ని కొన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పనంగా ఇచ్చేస్తారా అని కాంగ్రెస్‌ అంటుంటే, దేశ భద్రత మీకు అవసరం లేదా అని బీజేపీ ఎదురు ప్రశ్నిస్తోంది. అసలు రాఫెల్‌ ఒప్పందం ఎవరి హయాంలో ఎలా పట్టాలెక్కింది. ఎవరి టైంలో ఎంత ధర పలికింది. అసలు రాఫెల్‌ అగ్రిమెంట్‌ కథేంటి? ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ను మరింత శక్తివంతం చేయడానికి, 2000 సంవత్సరంలోనే అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం చాలా ఆలోచనలు చేసింది. యుద్ధ విమానాలను కొనాలని డిసైడయ్యింది. ఇదే ఆలోచన ఆచరణ రూపం దాల్చింది మాత్రం 2007 యూపీఏ హయాంలో. వార్‌ప్లేన్స్‌ కొనాలని డిసైడ్ కావడంతో, అనేక ప్రతిపాదనలు స్టడీ చేసింది కాంగ్రెస్ సర్కారు. అగ్రిమెంట్‌ బిడ్‌ దక్కించుకునేందుకు, బోయింగ్‌ ఎఫ్‌-18 సూపర్‌ హార్నెట్‌, లాక్‌ హీడ్‌ మార్టిన్‌- ఎఫ్‌ 16, దసో రాఫెల్‌, యూరో ఫైటర్‌ టైఫూన్‌, మికోయాన్‌ మిగ్‌-35, సాబ్‌ జేఏఎస్‌ 39 గ్రిపెన్‌ పేరిట ఆరు అగ్రశ్రేణి యుద్ధ విమాన తయారీ కంపెనీలు పోటీ పడ్డాయి. సాంకేతికంగా సమగ్ర సమీక్ష చేసిన తర్వాత, రాఫెల్‌, టైఫూన్‌ విమానాలను 2011లో షార్ట్‌లిస్ట్‌ చేసింది రెండోసారి పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. ధర తక్కువ కావడంతో రాఫెల్‌ను కొనాలని 2012లో నిర్ణయించింది.

రూ.54,000 కోట్లు చెల్లించి 126 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. వీటిలో రెడీగా 18 విమానాలను వెంటనే ఇచ్చేయడం...మిగిలిన 108 యుద్ధ విమానాలనూ బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో తయారు చేయడానికి ఫ్రాన్స్‌‌తో డీల్ కుదిరింది. కానీ ఎలక్షన్స్‌ డీల్‌ రూటే మార్చేశాయి.2015 సెప్టెంబరులో ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లారు ప్రధాని మోడీ. 126 యుద్ధ విమానాలను కొనాలని 2012లో యూపీఏ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఒక్క సంతకంతో రద్దు చేశారు. కేవలం 36 విమానాలే కొనుగోలు చేస్తున్నట్టు ఫ్రాన్స్‌ పర్యటనలో సడన్‌గా ప్రకటించేసి, అందర్నీ షాక్‌కు గురి చేశారు. అంటే 126 విమానాలకు బదులు 36 జెట్స్‌ మాత్రమే కొనాలని డిసైడయ్యారు. మోడీ మనసులోని మాట, నాటి రక్షణ మంత్రి మనోహర్‌ పారీకర్‌, రక్షణ శాఖ కార్యదర్శి మోహన్‌కుమార్‌కు, వైమానిక దళాధిపతికి గానీ అస్సలు తెలీదంటే ఆశ్చర్యం లేదు.

ఒక్కో రాఫెల్‌ జెట్‌కూ సగటున రూ.715 కోట్లు పడుతుందని ఫ్రాన్స్‌ పర్యటన తర్వాత మనోహర్‌ పారికర్ చేసిన ప్రకటన అందర్నీ మరో షాక్‌కు గురి చేసింది. ఈ షాక్‌ ఎందుకంటే, యూపీఏ హయాంలో ఒక్కో రాఫెల్‌ విమానం ధర రూ.530 కోట్లకే కొనాలని ఒప్పందం జరిగింది. అలాగని 725 కోట్ల రేటు కూడా స్థిరంగా ఉండలేదు. ఇప్పుడు మరోసారి రూటు మార్చుకుని, దిమ్మతిరిగేలా చేసింది. రూ.715 కోట్లు కాకుండా ఒక్కో జెట్్ విలువను రూ.1670 కోట్లు చేసేసింది మోడీ ప్రభుత్వం. విజువల్స్ యూపీఏ హయాంలో 126 రాఫెల్‌ విమానాల కొనుగోలుకు, రూ.54 వేల కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదిరితే, కేవలం 36 విమానాల కొనుగోలుకే మోడీ సర్కారు చెల్లిస్తున్న మొత్తం రూ.58 వేల కోట్లు. ఎంత తేడా కదా. ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్న కూడా ఇదే.

దశాబ్దాలుగా భారత రక్షణ రంగానికి అనేక యుద్ధ విమానాలు సమకూర్చిన బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లోనే తయారు చేయాలని యూపీఏ టైంలోనే దసో కంపెనీతో ఒప్పందం కుదిరింది. కానీ మోడీ ప్రభుత్వం, హాల్‌ను పక్కనపెట్టేసి, అందర్నీ విస్తుపోయేలా చేసింది. దశాబ్దాల అనుభవమున్నా హాల్‌కు అంత సామర్థ్యంలేదని పక్కనపెట్టేసి, అప్పుడప్పుడే అనుమతులు పొంది, పేపర్‌ మీదే కనబడుతున్న అనిల్‌ అంబానికీ డిఫెన్స్‌ కంపెనీకి కట్టబెట్టారు. రాఫెల్‌పై అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చిన పరిణామం ఇది. అసలు అడ్రస్‌లేని అనిల్ అంబానీ డిఫెన్స్‌ కంపెనీకి, రాఫెల్‌ విమానాల తయారీని ఇవ్వడమేంటని ప్రతిపక్షాలు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నాయి. అన్ని కంపెనీలు దివాళా తీయడంతో బేజారైన అనిల్‌ అంబానీకి లబ్ది చేకూర్చేందుకేనని మోడీ నిర్ణయం తీసుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవైపు రేట్లు పెంచడం, మరోవైపు అనిల్‌ అంబానీకి కట్టబెట్టడం, ధరలెంతో చెప్పమంటే వివరాలు చెప్పకపోవడం, ఇలా అనేక సందేహాలు రాఫెల్‌ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి.


Next Story