కోచ్‌పై మిథాలీ రాజ్ సంచలన వ్యాఖ్యలు

కోచ్‌పై మిథాలీ రాజ్ సంచలన వ్యాఖ్యలు
x
Highlights

మహిళా టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో క్రికెటర్ మిథాలీ రాజ్‌ను పక్కన పెట్టిన కెప్టెన్ హర్మన్ ప్రీత్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రధానమైన ఆటలో మిథాలీని...

మహిళా టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో క్రికెటర్ మిథాలీ రాజ్‌ను పక్కన పెట్టిన కెప్టెన్ హర్మన్ ప్రీత్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రధానమైన ఆటలో మిథాలీని క్రికెట్ జట్టులోకి తీసుకోకపోవడంపై టీం యాజమాన్యంపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మిథాలీపై సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తుంది. మిథాలీని ఎందుకు కీలక ఆటల్లో స్థానం ఎందుకు కల్పించలేదో చెప్పాలిని అభిమానులు, నెటిజన్లు భగ్గుమంటున్నారు. కాగా ఈ విషయం తొలిసారి మిథాలీ రాజ్ స్పందిస్తూ తనకు స్థానం దక్కకపోవడానికి ప్రధాన కారణం జట్టు కోచ్ రమేశ్ పవార్ అనే లేఖలో ప్రస్తవిస్తూ రమేశ్ పవార్ తనను చాలా దారుణంగా అవమానించారంటూ బీసీసీఐకి లేఖలో పంపించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై నాకు ఎలాంటి లొల్లి లేదని తను దేశం కోసం ప్రపంచకప్ సాధించాలన్న నా కోరిక కోరికగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయాలనే కొందరు పనికట్టుకొని ఈ పనులు చేస్తున్నారని వ్యక్తంచేసింది. నేను మంచి ప్లేయర్లని అయినా నన్ను పక్కన పెట్టి కేవలం ముగ్గురు మంచి బ్యాట్స్‌వుమెన్లతో సెమీఫైనల్ మ్యాచ్‌కి వెళ్లడం నన్ను ఎంతో బాధించింది’’ అని తన లేఖలో మిథాలీ పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories