logo
జాతీయం

మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి

Highlights

మహారాష్ట్రలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలి జిల్లా పల్లేడ్‌ అటవీ ప్రాంతంలో పోలీసులతో...

మహారాష్ట్రలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలి జిల్లా పల్లేడ్‌ అటవీ ప్రాంతంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. వీరిలో ఐదుగురు మహిళలున్నారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, మావోయిస్టుల కిట్ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారు. వీరి కోసం బలగాలు గాలిస్తున్నాయి. ఎదురుకాల్పుల నేపథ్యంలో పోలీసులు అక్కడ కూంబింగ్ ముమ్మరం చేశారు.

Next Story