మీకు ఓకే అయితే... మరి మా సంగతేంటి?

మీకు ఓకే అయితే... మరి మా సంగతేంటి?
x
Highlights

మహాకూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా కొలిక్కిరానట్టు కనిపిస్తోంది. ఓ వైపు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్నా.. మిగిలిన...

మహాకూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా కొలిక్కిరానట్టు కనిపిస్తోంది. ఓ వైపు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్నా.. మిగిలిన పక్షాల్లో మాత్రం సీట్లపై క్లారిటీ రాలేదు. సీట్ల సర్దుబాటుపై ఢిల్లీలో ముఖ్యనేతలు చర్చించినా సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో కాంగ్రెస్ 90 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు రెడీ అయిపోతుంటే.. తమ పరిస్థితేంటో అర్ధంకాని సీపీఐ, టీజేఎస్ మా సంగతి తేల్చాలంటోంది. లుక్

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్నా.. మహా కూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటు కుదరలేదు. కాంగ్రెస్ నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. ఓ వైపు మిగిలిన పక్షాల సీట్లపై క్లారిటీ రాకున్నా.. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ తన పని తాను చేసుకుపోతోంది. పార్టీ ముఖ్య నేతలు ఉత్తం, జానారెడ్డి, షబ్బీర్ అలీ, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, భట్టివిక్రమార్కలతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్ రహస్య భేటీ నిర్వహించారు. 90 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేశారు.

ఈ సమావేశంలో అభ్యర్థుల తుది జాబితాను రెడీ చేసి... నవంబరు 2న ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి అందజేయనున్నారు నేతలు. అంతా అనుకున్నట్టు జరిగితే.. నవంబరు 4, లేదా 5తేదీల్లో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గెహ్లాట్‌ చేతుల మీదుగా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే, తమ విషయం తేల్చకుండా మీరు అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారని సీపీఐ, టీజేఎస్ ప్రశ్నిస్తున్నాయి. టీడీపీ మాత్రం 15 స్థానాలకు సంతృప్తిగానే ఉండగా.. సీపీఐ, టీజేఎస్ మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. తమకు హుస్నాబాద్, బెల్లంపల్లి, కొత్తగూడెం, వైరా, మునుగోడు, దేవరకొండ స్థానాలపై క్లారిటీ ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేస్తుండగా... 15 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించి ముందుకు వెళ్తామని అంటోంది టీజేఎస్. మొత్తానికి సీట్ల సర్దుబాటు వ్యవహారంలో కాంగ్రెస్ సాగదీతపై ఆగ్రహంగా ఉన్న టీజేఎస్, సీపీఐ.. సీట్ల వ్యవహారాన్ని త్వరగా తేల్చాలంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories